ఎన్నికల విధుల్లో తలమునకలవ్వాల్సిన ఓ ఆఫీసర్ కు టైం బాలేనట్టుంది. ఇన్స్టాలో రెండు పిక్స్ పోస్ట్ చేసి తాను గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నట్టు రైటప్స్ పెట్టారు. సీన్ కట్ చేస్తే ఆయనపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని షాక్ ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ ను ఎన్నికల కమిషన్ జనరల్ అబ్జర్వర్ గా పోస్ట్ చేసింది. ఈ విషయాలన్నీ ఆయన తన ఫాలోయర్స్ కు వివరించే ప్రయత్నంలో ఈసీ చర్యలకు బలవ్వాల్సి వచ్చింది. 2011 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆయన గురువారం ఈ పోస్ట్ చేసిన వెంటనే ఈసీ సీరియస్ గా స్పందించింది. తక్షణం ఆయన్ను విధుల నుంచి తప్పించి మరో అధికారిని ఆయన స్థానంలో నియమించిందికూడా. విశేషం ఏమిటంటే అభిషేక్ చేసిన ఈ పోస్టుకు జస్ట్ 22 గంటల్లో 28, 597 లైక్స్ వచ్చాయి కానీ పాపం విధుల నుంచి ఆయన్ను తప్పించటం విశేషం.
పబ్లిసిటీ స్టంట్:ఈసీ ఆగ్రహం
పబ్లిసిటీ స్టంట్ అనే పిచ్చి పీక్స్ కు పోతే ఇలాగే అవుతుందంటున్నారు నెటిజన్స్. ఈయనకు కాస్త సోషల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకే పబ్లిక్ సర్వెంట్, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్, యాక్టర్ అంటూ తనను తాను అభివర్ణించుకుంటూ తన వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈయనకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉందికూడా. సోషల్ మీడియా బయోలో ఆయనకు మంచి అనుచరగణం ఉండగా వారందరికీ తన స్పెషల్ డ్యూటీ గురించి ఫోటోతో సహా వివరించే ప్రయత్నం చేశారు అభిషేక్. ఒక్క ఇన్స్టా లోనే ఆయనకు 3 మిలియన్ల ఫాలోయర్స్ ఉండగా ట్విట్టర్ లో 31,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.