Friday, October 18, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: రణరంగం కానీ చోటు భూ స్థలమంతా వెదికినా దొరకదు

Telugu literature: రణరంగం కానీ చోటు భూ స్థలమంతా వెదికినా దొరకదు

శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోని దేశ చరిత్రలు శీర్షికతో ఉన్న కవితలో రణరంగంకాని చోటు భూస్థలమంతా వెదికినా దొరకదు అన్న శీర్షికతో వ్యాసం వ్రాయాలన్న ఆలోచన మొదలైనప్పుడు మనసులో కలిగిన సంఘర్షణ అంతా ఇంతా కాదు, అలాంటి మహాకవి పైన నాలాంటి అల్పజీవి సాహిత్యపరమైన ప్రయోగం చేయడం అంటే గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించిందన్న చందంగా వుంటుంది. ఐనా సాహసం చేయకమానదు కదా మనసు అందుకే నాలో నేనే అనేక రకాలుగా సంఘర్షించుకొని కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ అన్న వాక్యాలను నేను కూడా అన్వయించు కొని నా బాధను ఆవేదననను అక్షర రూపంతో కూడిన ఆకృతిని ఇవ్వాలని నిర్ణయించుకొని వ్యాసం వ్రాయాలన్న బలమైన సంకల్పంతో వ్రాస్తున్నదే ఈ శీర్షికతో కూడిన వ్యాసం ఒక కవి లేదా మేధావి జీవించిన కాలంలో సమాజంలో జరుగుతున్న పరిణామాలు అతనిపై బలంగా ప్రభావితం చేస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు అలాంటి వారిలో శ్రీశ్రీ కూడా అందుకు మినహాయింపు కాదు ఇక్కడ ఇంకొక విషయం అదనంగా ప్రస్తావించాల్సిన అవసరం వున్నట్లు నా కనిపించింది. నిజాం నిరంకుశ పాలనను ప్రత్యక్షంగా చూసి నిజామా బాద్‌ జైలులో శిక్షను అనుభవించిన సమయంలో దాశరధి గారి నోటి వెలువడిన మాటలు జైలు గోడలపై బొగ్గుతో ఇలా ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను బొలినరాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు అంటాడు దీనిని బట్టి ఈ పాటికే విషయం అర్థమై ఉంటుంది, ఆ కాలంలో జీవించిన కవులు మేధావులపై ప్రపంచ పరిణా మాలు ఎలా ప్రభావితం చేశాయో అని చెప్పడానికి, ఇక శ్రీ శ్రీ లాంటి వ్యక్తి అలాంటి పరిణామాల పట్ల ప్రభావితం కాకుండా ఎలా ఉంటారు, వారి సాహిత్యం చదివితే ఎవరి కైనా ఇట్టే అర్ధమైపోతుంది ఆనాటి ప్రపంచ పరిణామాలు, సమాజపు స్థితిగతుల్ని ఎలా ఆకలింపు చేసుకుని స్పందిం చారో అర్ధం అవుతుంది.
శ్రీశ్రీ గారు పుట్టింది 1910లో మహాప్రస్థానం వ్రాసింది 1930 నుండి 1940 మధ్య కాలంలో ఈ ముప్పై సంవత్సరాల కాలంలో శ్రీశ్రీ గారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రపంచ పరిణామాలు, విప్లవాలు, మన దేశంలో గాంధీజీ నేతృత్వంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న జాతీయోద్యమం, అలానే 1914 నుండి 1919 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం మరియు 1939లో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధం, అదే విధంగా లెనిన్‌ నాయకత్వంలో రష్యా విప్లవం మావో నేతృత్వంలో చైనాలో ప్రజల తిరుగుబాట్లు మరియు క్యూ బాలో ఫేడెల్‌ కాస్ట్రో, చేగువేరా నాయకత్వంలో తిరుగు బాట్లు ఇవన్నీ ఒక ఎత్తైతే శ్రీశ్రీ గారు 1928-31 సంవత్స రాల మధ్య బి.ఏ. పాసయ్యారు తరగతి గదిలో చదివిన చరిత్ర పాఠాలు మరియు ఎక్కువగా ఇష్ఠమైన పుస్తక పఠనం వల్ల తెల్సుకొన్న ప్రపంచ పరిణామాలు ఫలితంగా శ్రీశ్రీ గారిని అభ్యుదయపు ఆలోచనల వైపు నడవడానికి బాటలు వేశాయి. అభ్యుదయ భావజాలానికి కొన సాగింపుగా రాసినదే మహాప్రస్థానం, తెలుగు సాహిత్యంలో పెను సంచలనం మహాప్రస్థానం కావ్యం. ఒక కాలంలో జీవించి రాబోయే కాలం గూర్చి కలలు కనటం కవికి సహజమే ఐనా శ్రీశ్రీ గారు ఊహించిన ప్రపంచం, ప్రయా ణించిన కలల లోకం ఎవరు చేరుకోలేరు అనటంలో అతి శయోక్తి లేదు స్వయంగా నేనొక దుర్గం! నాదొక స్వర్గం! అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అంటాడు, ఎత్తైన దుర్గంపై నిలబడి ప్రపంచం మొత్తాన్ని వీక్షించగలిగాడు కాబట్టే మహాప్రస్థానం అతని కలం నుండి జాలువారింది. నాటి నుండి నేటి వరకు అందులో ప్రస్తావించిన కవిత్వాం శాలు ప్రపంచంలోని ఏదో ఒక మూలన ప్రస్తుతం జర గటం వారి భవిష్యత్‌ ఊహాశక్తికి కల్పనా చాతుర్యానికి, వాస్తవిక దృక్పదంతో కూడిన ఆలోచనను ఎంత పొగిడిన తక్కువే.
ఇక శ్రీశ్రీ గారు ప్రస్తావించిన నాటి కవిత్వాంశాలు చూద్దాం …
ఏదేశ చరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం ?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం.
పరస్పరా హరణోద్యోగం,
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం
రణరంగం కానిచోటు
భూస్థలమంత వెదకిన దొరకదు,
గతమంతా తడిసే రక్తమున
కాకుంటే కన్నీళ్ళతో
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కన్పించని
కథలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం
మహాప్రస్థానం కావ్యంలో దేశ చరిత్రలు శీర్షికతో ఉన్న ఈ కవితను శ్రీశ్రీ గారు చారిత్రక దృక్పధంతో వ్రాసిన ట్లుగా చెప్పొచ్చు తను స్వతహాగా డిగ్రీ చదివినప్పుడు ప్రపంచ చరిత్రలో మానవుడి స్థానం, జాతుల సంఘర్షణ, ఆదిపత్య పోరాటం, మానవ పరిణామ క్రమంలో జరిగిన ఎన్నో భౌగోళిక మరియు మేధోపరమైన మార్పుల ఫలితమే నేడు మనం కళ్ళతో చూస్తున్నది మరియు ఆస్వాదిస్తున్నది, ఆదిమానవుడి కాలంలో మానవుల వలసలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి లేదా నదీ తీర ప్రాంతాలకు వచ్చి సేద తీరటం, తర్వాత సామూహిక జీవనం, పట్టణీ కరణ, ఏది ఏమైనా మానవుడి సంక్షేమం చుట్టూ తిరిగే నాగరికత మరియు పాలనా వికేంద్రీకరణతో కూడిన సంఘర్షణలు, ఆదిమ సమాజంలో మానవుడు తనను తాను కాపాడుకోవటం కోసం క్రూర మృగాల నుండి ప్రకృతి నుండి కాపాడుకోవాటానికి సంఘర్షణకు గురైతే అనంతరం మాధ్యయుగాలలో మనిషికి మతానికి మధ్య సంఘర్షణ జరిగితే, తర్వాత దేశాల మధ్య వలసలు కొన సాగడం స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం, ఒక జాతి ఇంకొక జాతిపై ఆదిపత్యం చెలాయించటంతో మళ్ళీ మొదలైన వర్గ సంఘర్షణ, పారిశ్రామిక విప్లవం, ఫలితం గా వచ్చిన మార్పులు, సంస్కృతిక పునర్జీవనం, మత సంస్కరణోద్యమం, పాలకులు మరియు రాజుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన విప్లవాలు మనదేశంలో జాతీయోద్యమం, చైనా విప్లవం, మొదలైనవన్ని మనిషి సంఘర్షణ నుండి సంక్షేమం మరియు స్వేచ్ఛ కోసం జరిగినవే.
ఇక్కడ శ్రీశ్రీ అదే ప్రస్తావిస్తు నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం, రణరంగం కానిచోటు భూస్థల మంతా వెదికినా దొరకదు అని అంటారు. ఇప్పటికే నేను చెప్పిన విషయం అర్ధమై వుంటుంది. మనిషి ఆదిపత్యం కోసం ఒకరు, స్వేచ్చా వాయువులు ఆస్వాదించటానికి మరొకరు ఫలితంగా ఏర్పడిన సంఘర్షణ, ఇవన్ని ఒక ఎత్తు ఐతే శ్రీశ్రీ మహా ప్రస్థానం కావ్యం మొదటిసారిగా ముద్రించబడిన సంవత్సరం 1950 అంటే నేటికీ 72 సంవత్సరాలు, ఈ డబ్బు రెండు సంవత్సరాల కాలంలో మనిషి ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్ల సంఘర్షణకు గురవు తూనే ఉన్నడు, అందుకు ఉదాహరణలు ఇండియా పాక్‌ యుద్ధo, ఇండియా చైనా యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఉభయ కొరియా యుద్ధం, ఇజ్రాయిల్‌ పాలస్తీనా సంఘర్షణ, క్యూబా విప్లవం, అలానే ఇరాక్‌ ఐరాన్‌ యుద్ధం, అమెరికా అప్ఘనిస్తాన్‌ యుద్ధం, అప్ఘనిస్తాన్‌ లో తాలిబన్ల తిరుగుబాటు, తాజాగా నేడు ఉక్రెయిన్‌ పై పై రష్యా చేస్తున్న యుద్ధం ఫలితంగా మానవ సంక్షేమంపై ఏర్పడిన సంఘర్షణ పూరిత వాతావరణం. అందుకే ఇక్కడ శ్రీశ్రీ గారు నాటి నుండి నేటి వరకు సాహితీ వినీలా కాశంలో దృవతారగా వెలుగొందటానికి కారణం భవిష్య త్తును గూర్చి ఊహించిచెప్పటం, గత చరిత్రను కావ్య రూపంలో కళ్ల ముందుంచి మానవుడి రక్త చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయటం.
ఇందులోనే మరోచోట ఇలా అంటారు కధలన్ని కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం అని దేన్ని దాచలేo ప్రపంచమంతా గ్రామంగా మారిన వేల ప్రపంచీకరణ వల్ల మానవ వికాసం జరిగి ప్రపంచం నలుమూలల ఏ సం ఘటన జరిగినా వెంటనే కళ్ళముందు ప్రత్యక్షం కావటం మనం చూస్తున్నదే, అందుకే మహా ప్రస్థానం నేటికీ సజీవం గా మరియు యదార్ధంగా మనిషి చుట్టూరా జరిగే విద్వాం సాలను శ్రీశ్రీ గారు ముందే ఊహించి చెప్పారు. ఆది మానవుడు అభద్రతతో, ప్రకృతితో, పరిస్థితులతో, కాల మార్పులతో పోరాడుతూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటే ఆధునిక మానవుడు నేడు ఆదిపత్యం కోసం పొరుగు దేశాలపై, ప్రజలపై పోరు కొనసాగిస్తున్నాడు ఫలితంగా వ్యక్తి స్వేచ్ఛ ప్రశ్నార్ధకం. నేడు ఉక్రెయిన్‌ పౌరులు వారి మానసికస్థితి ఏమిటి ఏక్షణం ఏ బాంబు ఎక్కడి నుండి వచ్చి పడుతుందో, రేపటి ఉషోదయం వారిని ఎలా పల కరిస్తుందో అని భయం గుప్పిట్లో, చిధ్రం ఐన బాల్యం, ప్రశ్నార్ధకం అవుతున్న మానవుడి స్వేచ్చా? ఎటువైపు ఈ పయనం ఏ యుద్ధం ఎందుకు జరుగుతోందో? నిజంగా అశోకుడైనా, అలెగ్జాండర్‌ ఐనా వేల మందిని చంపిరక్త దాహం తీరిన తర్వాత గొప్ప వ్యక్తులుగా చరిత్రకెక్కి ఏం లాభం? ఎందుకీ విజయం అని యుద్ధం తర్వాత ఆలో చించటం దేనికి? యుద్ధానికి ముందే ఆలోచించి యుద్ధ నివారణతో జరిగే పాణ నష్టం గూర్చి ఆలోచించలేకపో వటం వారి రాజ్య కాంక్ష కదా? అందుకే సాటి మనిషి పట్ల హింసను, తోటి మనిషిపై అజమాయిషి చెలాయించాలను కోవటం దాని ద్వారా వచ్చే సంఘర్షణను ఊహించలేక పోవటం నా దృష్టిలో అజ్ఞానమే, మానవ శ్రేయస్సును కోరని ఏ పాలకుడైనా ప్రభుత్వమైనా ఎక్కువ కాలం మను గడ కొనసాగించ లేదు.
తాను జీవించిన కాలంలోనే అనేక రకాల సంఘర్షణ లను చూసి చలించి ఒక కొత్త ప్రయాణం మనిషి చేయాలని అది గొప్పగా ఉండాలని ఎలాంటి సంఘర్షణలు లేనిదై మానవ కళ్యాణానికి ఉపయోగపడాలని అలాంటి మార్గం వైపు పయాణించాలని స్వాతంత్య్రం, సమభావం, సౌభా తృత్వం, సౌహార్ధం కలగాలని ఈ స్వప్నం నిజమౌతుంది, ఈ స్వర్గం ఋజువవుతుంది అంటాడు. అందుకే మనిషి గొప్ప ప్రయాణం చేయాలని అలాంటి రోజులే ముందు ముందు రావాలని, మనిషి స్వేచ్ఛగా అన్నిచోట్ల సంచరిం చాలని ప్రపంచమంతా ఎలాంటి సంఘర్షణలు లేని సమసమాజాన్ని సృష్ఠించుకొని మానవ వికాసానికి మంచి మార్గాలు వేసుకొని శ్రీశ్రీ ఊహించిన అభ్యుదయ సమాజo వైపు అడుగులు వేద్ధాo.
డా॥మహ్మద్‌ హసన్‌
సాహిత్య విమర్శకులు
9908059234.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News