Tuesday, November 26, 2024
Homeఆంధ్రప్రదేశ్May day: కార్మిక హక్కుల పరిరక్షణకై ఉద్యమించండి

May day: కార్మిక హక్కుల పరిరక్షణకై ఉద్యమించండి

ప్రపంచ కార్మికుల దినోత్సవానికి కారణమైన చికాగో అమరుల స్పూర్తితో నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టి హక్కుల పరిరక్షణ కోసం కార్మిక లోకం పోరాడాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రామడుగు మండలంలోని రామడుగు,గోపాల్ రావుపేట ,లక్ష్మీపూర్,దేశరాజ్ పల్లి,గుండి, షా నగర్ తదితర గ్రామాల్లో ఎర్ర జెండాలు ఎగురవేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక లోకం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ,చట్టాలను నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అన్నారు.కార్మిక సంక్షేమం కోసం పనిచేయకుండా పెట్టుబడిదారీ వర్గాలకు కొమ్ముకాస్తూ దోపిడీ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.8 గంటల పని దినాల కోసం ఆరోజు కార్మిక వర్గం వీరోచిత పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేసి హక్కులను సాధించుకున్నారని,పని గంటలు తగ్గించుకున్నారని అన్నారు.కానీ నేడు తిరోగమన విధానాలను పాలకులు అవలంభిస్తున్నారని అన్నారు.కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కొడులుగా తెచ్చి హక్కులను కారాస్తుందని శ్రమకు తగిన ఫలితం లేకుండా, పని గ్యారంటీ హామీ లేకుండా చేస్తోందని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక లోకం 147 కార్మిక దినోత్సవం పురస్కరించుకుని నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం,ఉద్యోగ భద్రత,8 గంటల పని దినాలు,కాంటాక్ట్, ఔట్ సొర్సింగ్ పద్ధతి రద్దు కోసం మరో చికాగో పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, నాయకులు ఆశా వర్కర్స్ రబియా బేగం,నెరేళ్ల మంజుల,దాసరిరేణుక, రాజమని,అనురాధ,దర్మా,మిరియాల ఎఐటియుసి నాయకులు శంకరయ్య, నర్సయ్య, మ్యాక స్వామి, నాంపల్లి, మలయ్య, ఓదెలు,అరవింద్,రవి పేయింట్స్ వర్కర్స్ యూనియన్ లింగుస్వామి, విక్రమ్, వేల్పుల హరికృష్ణ,దాసరి బాబు,గ్రామపంచాయతీ వర్కర్స్ నాయకులు దాసరి కనుకయ్య, దాసరి రాజు,గంగవ్వ, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News