కార్మికుల దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు పారిశుధ్య కార్మికులను సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక శక్తి లేనిదే ఈ వ్యవస్థ లేదని ప్రతి కార్మిక కుటుంబానికి శుభాభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆతరువాత కేపీహెచ్బీ డివిజన్లోని రమ్య గ్రౌండ్ వద్ద కార్మికుల కొరకు 50 లక్షల రూపాయలతో భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు.. ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కే.పి.హెచ్.బి డివిజన్ లో మేడే దినోత్సవంలో పాల్గొన్నారు. తాను అల్విన్ కంపెనీలో ఒక కార్మికుడిగా పని చేశానని కార్మిక కష్టనష్టాలు తనకు తెలుసని కార్మికులు లేనిదే వ్యవస్థ నడవదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకువచ్చి కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న నాయకుడు కేటీఆర్ అని ఎమ్మేల్యే కృష్ణారావు అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కంపెనీలను తీసుకువస్తుంటే బిజెపి ప్రభుత్వం మాత్రం కంపెనీలను అమ్మకానికి పెడుతుంది అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కంపెనీలను అమ్మకానికి పెడుతున్న బిజెపి ప్రభుత్వంపై కార్మికులు అంత ఏకమై పోరాడుదాం అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.. అనంతరం ఈ కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి 200 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.