Saturday, September 21, 2024
HomeతెలంగాణJammikunta: కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Jammikunta: కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కార్మికుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. పాత వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో తక్కల్లపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గ సంక్షేమానికి తగిన ప్రాముఖ్యత ఇస్తుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.m కార్మికుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటుపరం చేస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ సంఘటితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు కార్మికులు ఐక్యంగా ఉండి వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.

- Advertisement -

ఈ సందర్భంగా పలువురు హమాలీ కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కేడీసీసి వైస్ చైర్మన్ పింగిలి రమేష్, పోనగంటి మల్లయ్య మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి కార్మిక సంఘం నాయకులు గుంటి సమ్రాజ్జం, ఓల్లల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

support
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News