Friday, November 22, 2024
HomeతెలంగాణJammikunta: జమ్మికుంట తపాలా కార్యాలయంలో మే డే వేడుకలు

Jammikunta: జమ్మికుంట తపాలా కార్యాలయంలో మే డే వేడుకలు

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొనిజమ్మికుంట తపాలా కార్యాలయం లో మే డే వేడుకలను బ్రాంచ్ మేనేజర్ ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో, తపాల ఉద్యోగుల సంఘం హుజురాబాద్ బ్రాంచ్ (P3) అసిస్టెంట్ సెక్రటరీ బత్తిని. రాజ్ కుమార్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం, తపాల ఉద్యోగుల సంఘం (P3)ఆర్థిక కార్యదర్శి ch.ప్రవీణ్ కుమార్.మాట్లాడుతూ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రైతు,కార్మిక ,కర్షక, శ్రామిక లోకానికి వ్యతిరేకంగా పార్లమెంటులో నల్ల చట్టాలను ప్రవేశపెట్టిన క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన రైతులు, ప్రజలు, దాదాపు సంవత్సరం కాలం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరాటం చేస్తే సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా మొసలి కన్నీరు కారుస్తూ అట్టి చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారుకానీ ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతంగానికి సానుభూతి ప్రకటించిన AIPEU (P3) యూనియన్ గుర్తింపు రద్దు హేయమైన చర్య, ఇది కేంద్ర ప్రభుత్వ నిరంకుశ నియంత పాలనకు, నిదర్శనం అని అన్నారు.

- Advertisement -

దేశంలోని అన్ని కార్మిక సంఘాలలో నిరంతరం ఉద్యోగుల, ప్రజా, సమస్యలపై, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా ,ఉద్యోగ, వ్యతిరేక ,విధానాలపై పోరాటం చేస్తున్నటువంటి AIPEU (P3) యూనియన్ కు ,రద్దు చేసినటువంటి గుర్తింపు ను, వెంటనే తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, తపాల శాఖ తీసుకున్న హేయమైన చర్యలకు, వ్యతిరేకంగా మున్ముందు యూనియన్ కార్యక్రమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు వేములరాజు, హరీష్, ద్రాక్ష, md.అలీ, నగేష్, గణేష్, ఖాజా, నవీన్, సమీర్, వేణు, ఇసం, ప్రవీన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News