ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను” బహుజన శ్రామిక దినోత్సవంగా శ్రామికులారా జ్ఞానవంతులు కండి “అనే నినాదంతో బహుజన టీచర్స్ అసోసియేషన్ పాతబస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ కి “నీలిపూలదండ” వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా గోరవాద్యక్షుడు, డి. రామశేషయ్య, బహుజన విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకుడు కృష్ణయ్య, బి టి ఏనాయకుడు మోసెస్ మాట్లాడుతూ భారత దేశంలో ఎలాంటి ఎలాంటి రక్త తర్పణమ్ లేకుండనే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెంబెడ్కర్ ఉద్యోగులకు, మహిళలకు, బహుజన శ్రామికులకు అనేక హక్కులను కల్పించాడు నేడు శ్రామికులు పొండుతున్న ప్రతి సౌఖర్యం వెనుక అయన శ్రమ ఉందన్నారు. శ్రామికుల్లో 90%మంది బహుజనులే ఉన్నారు కాబట్టే మనువాద ప్రభుత్వాలు కార్పొరేట్లకొరకు బహుజన శ్రామిక హక్కులను సంస్కరణలపేరుతో కా లరస్తున్నారన్నారు.అంబేద్కర్ ఫూలేఆశయాలతో తిప్పికొట్టాలన్నారు. వారిశయాలను సాధించటమే అమహనీయులకు నిజమైన నివాళి అన్నారు. సమావేశములో అంబేద్కర్ ఆశయ వారసులు అంబేద్కర్ వాదులు మౌలాలి, p. రంగస్వామి, చిరంజీవి. బి టి ఏ ప్రధానకార్యదర్శి బి సుధాకర్, నాయకులు నందీశ్వరుడు, నాగార్జున, రామచంద్రుడు పాల్గొన్నారు.
Kalluru: ఘనంగా బహుజన శ్రామిక దినోత్సవం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES