Friday, September 20, 2024
Homeహెల్త్oily skin?: జిడ్డు ముఖం మెరిసే ముఖం కావాలంటే?

oily skin?: జిడ్డు ముఖం మెరిసే ముఖం కావాలంటే?

జిడ్డు చర్మం ఉన్నవాళ్లు పాటించాల్సిన స్కిన్ కేర్ అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..
జెల్ బేస్డ్ లేదా ఫోమ్ బేస్డ్ మైల్డ్ క్లీన్సర్ తో స్కిన్ కేర్ రొటీన్ ప్రారంభించాలి. చర్మం పొడారిపోకుండా ఉండడానికి తేలికపాటి క్లీన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. యాక్నే సమస్య ఉన్న జిడ్డు చర్మానికి సలిసిలిక్ ఆమ్లం ఉన్న క్లీన్సర్స్ బాగా పనిచేస్తాయి. ఈ క్లీన్సర్ చర్మ రంధ్రాల లోపలికంటా పోతుంది.
లోపల పేరుకుని ఉన్న జిడ్డును పోగొడుతుంది. ఈ క్లీన్సర్ ను రోజుకు రెండుసార్లు మించి వాడకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జిడ్డు చర్మానికి టోనర్స్ వాడకం చాలాముఖ్యం. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఆల్కహాల్ లేని టోనర్లను వాడాలి. ఇది చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన్న మురికిని శుభ్రంచేస్తుంది. అంటే ఇది క్లీన్సర్లు చేయని పని చేస్తుంది. ఆల్కహాల్ లేని టోనర్లు చర్మంలోని పిహెచ్ ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. సెంటు వాసన లేని, చర్మానికి సాంత్వన నిచ్చే, చర్మాన్ని తాజాగా ఉంచే ఆల్కహాల్-ఫ్రీ టోనర్ ను వాడాలి. చర్మం బ్రేకవుట్ల, చర్మంపై ఉన్న మచ్చలు పోవడానికి సాలిసిలిక్ యాసిడ్ (బిహెచ్ ఎ) ఉన్న సిరమ్ ను వాడాలి. ఇది ఎంతో శక్తివంతమైన ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్, వేప పొడి కలిపిన పేస్టు అప్లై చేస్తే కూడా చర్మంపై ఉండే యాక్నేపోతుంది. అలాగే గ్లైకోలిక్ యాసిడ్ లేదా లాక్టిక్ యాసిడ్ వంటి ఎహెచ్ఎ రకం తేలికపాటి ఎక్స్ ఫొయిలేటర్లు ముఖంపై ఏర్పడ్డ గీతలు, దెబ్బతిన్న స్కిన్ టోన్ , పిగ్మెంటేషన్ లపై బాగా పనిచేస్తాయి. చర్మంలోని మ్రుతకణాలను ఈ సిరమ్స్ పోగొడతాయి. కణాలను అధికంగా ఉత్పత్తి చేసి చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గిస్తాయి కూడా. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ఏ కెమికల్ ఎక్సెఫొయిలెంట్ల నైనా సరే సాయంత్రాలు అప్లై చేయడం మంచిది.

- Advertisement -

జిడ్డు చర్మంపై ఆయిల్ లేని (ఆయిల్ –ఫ్రీ ) మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది. జిడ్డు చర్మానికి, యాక్నే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న చర్మానికి, కాంబినేషన్ చర్మానికి హలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ ఉండే తేలికపాటి జెల్ ఫార్ములేషన్లు మంచివి. ఇవి చర్మానికి కావలసినంత హైడ్రేషన్ అందిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎస్ పిఎఫ్ కి జిడ్డుచర్మం వాళ్లు దూరంగా ఉండాలి. ఎందుకంటే అది గ్రీజీగా, స్టిక్కీగా ఉండే ఫార్ములేషన్.
అందుకే చర్మాన్ని తేలికగా ఉంచే జెల్ లేదా పౌడర్ రూపంలో ఉండే సన్ స్క్రీన్ ను మాత్రమే జిడ్డు చర్మంపై రాసుకోవాలి. ఈ స్కిన్ కేర్ రొటీన్ ను అనుసరించడంతో పాటు ముఖాన్ని తరచూ తుడుచుకోవడానికి బ్లాటింగ్ పేపరును కూడా ఈ రకం చర్మం ఉన్నవాళ్లు తమ దగ్గర పెట్టుకోవాలి. యాక్నే సమస్య ఉన్న జిడ్డు చర్మం వాళ్లు బెంటోనైట్ క్లే, కాలిన్ క్లే మాస్కులను ముఖానికి పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జిడ్డు చర్మం వాళ్లు పౌడర్ రూపంలో ఉండే ఫౌండేషన్ వాడితే మంచి ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా జిడ్డుచర్మంపై ఫౌండేషన్నుఆచితూచి అప్లై చేసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News