Saturday, November 23, 2024
Homeహెల్త్summer care: వేసవిలో అలొవిరాతో స్కిన్ కేర్

summer care: వేసవిలో అలొవిరాతో స్కిన్ కేర్

వేసవి స్కిన్ కేర్ రొటీన్ లో అలొవిరా చేసే అద్భుతాలు ఎన్నో. చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా, పట్టులా మెరిపిస్తుంది అలొవిరా. వేసవిలో చేబట్టే చర్మసంరక్షణలో అలొవిరాను ఎన్నో రకాలుగా చేర్చవచ్చు. అలొవిరా చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మాన్ని ఎంతో మ్రుదువుగా కనిపించేలా చేస్తుంది. అలొవిరాను మాయిశ్చరైజర్ గా, టోనర్ గా, ఫేస్ మాస్కులో, కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాల నుంచి స్వాంతన నిచ్చే క్రీముగా ఇలా అన్ని రకాలుగా వాడొచ్చు. అలొవిరాలోని సుగుణాలు వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మెరిసేలా చేస్తుంది. చర్మ సౌందర్యానికి అలొవిరాను రకరకాలుగా ఉపయోగించుకునే టిప్స్ ఎన్నో ఉన్నాయి. అలొవిరా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. ముఖానికి సన్ స్క్రీన్ రాసుకోవడానికి లేదా మేకప్ వేసుకోవడానికి ముందు అలొవిరా జెల్ ను పలుచటి లేయర్ లా ముఖానికి రాసుకుంటే ఎంతో మంచిది. అలొవిరా కూలింగ్ ఏజెంట్. అందుకే వేసవిలో ఇది చర్మరక్షణకు ఎంతో సహాయపడుతుంది. వేసవిలో చాలామందికి దద్దుర్లు, ఇరిటేషన్లు తలెత్తుతుంటాయి. అలొవిరా జెల్ వీటిపై అప్లై చేయడం వల్ల మంట తగ్గి కావలసింత చల్లదనాన్ని చర్మానికి ఇవ్వడమే కాకుండా ఎంతో సాంత్వననిస్తుంది కూడా. వేసవిలో చర్మం టెక్స్చెర్ బాగుండేలా అలొవిరా ఫేస్ మాస్కు సహాయపడుతుంది.
చర్మంపై ఏర్పడ్డ యాక్నే తగ్గుతుంది. టేబుల్ స్పూన్ అలొవిరా జెల్ తీసుకుని అందులో ఒక టీస్పూను తేనె, నిమ్మరసం కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.ఇలా చేస్తే చర్మం ఎంతో మ్రుదువుగా తయారవుతుంది. అలొవిరా స్కిన్ టోనర్ గా కూడా పనిచేస్తుంది. చర్మంలోని పిహెచ్ ప్రమాణాలను సమతుల్యం చేస్తుంది. అలొవిరా జెల్, నీళ్లు రెండింటినీ సమాన పరిమాణాల్లో తీసుకుని ఆ మిశ్రమాన్ని కాటన్ ప్యాడ్ తో ముఖానికి ఒత్తుతూ మ్రుదువుగా రాసుకోవాలి. అలాగే కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు తగ్గడానికి కూడా అలొవిరా క్రీము ఉపయోగపడుతుంది. కళ్ల కింద వాపును సైతం అలొవిరా ఐ క్రీము తగ్గిస్తుంది. అందుకే రాత్రి నిద్రపోయే ముందు కళ్ల కింద అలొవిరా జెల్ రాసుకుని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలొవిరాను బాడీ లోషన్ గా కూడా వాడొచ్చు. ఇది శరీర చర్మాన్ని పట్టులా చేస్తుంది. స్నానం చేసిన తర్వాత అలొవిరా జెల్ ను శరీరానికి రాసుకుంటే చర్మం మ్రుదువుగా మారుతుంది. అలొవిరా సహజసిద్ధమైన లిప్ బామ్. అలొవిరా జెల్ ను పెదవులకు రాసుకుంటే పెదాలకు కావలసినంత హైడ్రేషన్ తో పాటు చర్మాన్ని సూర్యరశ్మి బారిన పడకుండా కూడా ఈ బామ్ కాపాడుతుంది. రోజంతా మీ పెదవులు నున్నగా మెరుస్తూ ఉండాలంటే కాస్తంత అలొవిరా జెల్ ను పెదాలకు రాసుకోవాలి. అలొవిరా స్క్రబ్ మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా కూడా పనిచేస్తుంది. ఈ స్క్రబ్ ను కూడా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

- Advertisement -

రెండు టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన అలొవిరా జెల్, ఒక టేబుల్ స్పూన్ ముడి తేనె, పావు కప్పు ఆర్గానిక్ సముద్రపు ఉప్పు తీసుకోవాలి. పావుకప్పు సముద్ర ఉప్పులో అలొవిరా జెల్ కలిపి పేస్టులా చేయాలి. అందులో ముందు చెప్పిన పరిమాణంలో ముడి తేనెను కలపాలి. అలొవిరా స్క్రబ్ రెడీ. ఈ స్క్రబ్ ను ముఖానికి పూసుకొని మసాజ్ చేయాలి. కాసేపు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. దీంతో చర్మంపై మలినాలు పోయి బాగా శుభ్రం అయి మిల మిలలాడుతుంది. వీటన్నింటితో పాటు నీళ్లు బాగా తాగడం, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, ఇంటిపట్టున ఉండడం, చర్మన్ని క్లీన్సింగ్ చేసుకోవడం, ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవడం, తక్కువ మేకప్ వేసుకోవడం, చేతులకు మాయిశ్చరైజర్ పెట్టుకోవడం వంటివి వేసవి స్కిన్ కేర్ రొటీన్ లో తప్పనిసరిగా అనుసరించాలని మరవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News