Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Holagunda: చేతివాటం డీలర్లదా ? లేక అధికారులదా?

Holagunda: చేతివాటం డీలర్లదా ? లేక అధికారులదా?

పేదల బియ్యం తరలించడంలో అక్రమాలు జరుగుతున్నాయని హోళగొంద తాసిల్దార్ కార్యాలయం ముందు ఏకంగా రేషన్ బియ్యం బస్తాతో ఎండియు (మొబైల్‌ డిస్పెన్సివ్‌ యూనిట్‌) వాహన యజమాని ఇలియాజ్, వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్లా ఆందోళనకు దిగారు. తాసిల్దార్ హుస్సేన్ సాబ్ సమక్షంలో తూకం వేయగా 33. 500 కిలోలు రావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. 50 కిలోల కు బదులు 33 కిలోల బియ్యం బస్తా వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. బస్తాకు సీలుంటే నికరమే అంటున్నారని, తూకంలో 17 కిలోలు తక్కువగా వస్తే డీలర్ లు ఎండియు వాహనదారులకి అలాగే ఇస్తున్నారని, పి డి యస్ బియ్యం తూకంలో కోత వస్తుండడంతో కార్డుదారులకు ఏమని సమాధానం చెప్పాలని ఎమ్మార్వోని ప్రశ్నించారు.

- Advertisement -

ఆలూరు ఎం.ఎల్.ఎస్ కేంద్రం నుండి రేషన్ షాపులకు వచ్చే పేదల బియ్యం తక్కువ రావడానికి డీలర్ల చేతివాటమా లేక అధికారుల చేతివాటమా అంటూ ఎమ్మార్వో హుస్సేన్ సాబ్ ను నిలదీశారు.పేదల బియ్యం తరలించడంలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై ఆలూరు ఎం ఎల్ ఎస్ గోడన్ ఇంచార్జ్ అధికారిణి శ్రీ దేవీని తెలుగు ప్రభ రిపోర్టర్ వివరణ కోరగా డీలర్ లకు ఇండెంట్ లో ఉన్న క్వింటల బియ్యన్ని కాట వేసి ఇస్తామని, తూకంలో తక్కువగా వచ్చే ప్రసక్తే లేదని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News