బనగానపల్లె మండలంలోని కృష్ణగిరి, పెదరాజుపాలెం గ్రామాలలో పెద్దమ్మ అమ్మవారి దేవర జరుగుతోంది. దీంతో డోన్ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బనగానపల్లె ఇంచార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రియతమ్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె ఎస్సైలు వీరేష్ బాబు, వీరాంజనేయులు, నందివర్గం ఎస్ఐ రామాంజనేయులు రెడ్డి, అవుకు జగదీశ్వర్ రెడ్డి లు కలిసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు క్రిష్ణగిరి పెదరాజుపాలెం గ్రామాలలో ఎస్సైలు పర్యటించి శాంతి భద్రతలపై పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించినట్టు వెల్లడించారు సిఐ ప్రియతమ్ రెడ్డి. వాహనాలు నిలుపు ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు. మండలంలో మొదటిసారిగా పెద్దమ్మ దేవర ఒకే రోజు రెండు గ్రామాలలో నిర్వహించడం తో పోలీసులు మరింత శ్రమించాల్సి వస్తుంది.
Banaganapalli: ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక నిఘా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES