కరీంనగర్ జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు కార్డియో పల్మనరీ రెసిటేషన్( సి పి ఆర్ )శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్డియో పల్మనరీ రెసిటేషన్, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిసిబ్రీ లెటర్( ఏ ఈ డి) శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా సిపిఆర్ శిక్షణ పొందాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితా దేవి మాట్లాడుతూ మే2 నుండి ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణకు మున్సిపల్ సిబ్బంది65 మంది హాజరై శిక్షణ తీసుకున్నారని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, శిక్షకులు డాక్టర్ నాగ శేఖర్, సిహెచ్ రంగారెడ్డి ఎన్సిడి పిఓ డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.