Friday, November 22, 2024
HomeతెలంగాణThirumalayapalem: తడిచిన ధాన్యమంతా కొనాల్సిందే: సంభాని

Thirumalayapalem: తడిచిన ధాన్యమంతా కొనాల్సిందే: సంభాని

రైతులు కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చి , మంచి గిట్టుబాటు ధరతో అమ్ముకొని కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని కోరుకొనే సమయానికి వర్షాలు వలన చేతికొచ్చిన పంట నష్టపోతూ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సంభాని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులపై కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఇప్పటికే పంటకోసం తీసుకొన్న వ్యవసాయ రుణాలు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను మోసంచేసి నట్టేట ముంచిన ఈ ప్రభుత్వం ఇప్పుడు రైతులు కష్టపడి ఆరుకాలం పండించిన పంటను సకాలంలో కొనకుండా గత 15 రోజులనుండి కాలయాపన చేయడం వలన అకాలవర్షాలకు వరిధాన్యం తడిసిందని ఇదే అదునుగా భావించి దళారులు రైతులను దోచుకుంటున్నారని మాజీమంత్రి, TPCC సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ, సహకారాలు లేకపోవడం వలన రైతులు తడిచిన పంటల విషయంలో ఏమి చేయాలో అర్థంకాక లబోదిబోమంటూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఇదే అదునుగా దళారులు అందినకాడికి దండుకుని రైతుల నడ్డి విరుస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన రైతులు అష్ట కష్టాలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం దుర్మార్గం అని తెలిపారు. రైతు పక్షపాతి అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి చివరిగింజ వరకు కొనుగోలు చేపట్టి, వర్షాలతో తడిచిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధరలకు తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర పంటలు మిరప,మొక్కజొన్న, మామిడి, ప్రత్తి రైతులకు కూడా అండగా ఉండాలన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పంటల భీమా పధకం తెస్తామని చెబుతూ రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్దమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతులను ఎల్లవేళలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News