బాల్యవివాహాలను జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇల్లందకుంట తహసీల్దార్ ఠాకూర్ మాధవి అన్నారు. బాల్యవివాహాల జరగకుండా తీసుకోవలసిన చర్యలపై ఇల్లందకుంట తాహసిల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఠాకూర్ మాధవి మాట్లాడుతూ బాల్య వివాహాలు చేస్తే ఎదురయ్యారు ఇబ్బందులపై గ్రామీణ ప్రాంతాల్లో ని నిరక్షరాష్యులైన ఆడపిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం జరిపించేలా చూడాలన్నారు. పూజారులు, చర్చి పాస్టర్లు వయసు నిర్ధారణ చేయకుండా వివాహాలు జరిపించవద్దని కోరారు. ఐకెపి సమావేశాలలో బాల్యవివాహాలు, మిషన్ వాత్సల్య పై వివో అధ్యక్షురాలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సిడిపిఓ భాగ్యలక్ష్మి, సూపర్వైజర్ రమాదేవి, ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తులసీదాస్, ఇన్ చార్జి ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ విడపు శ్రీనివాస్, తిరుపతి, రమేష్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.