Friday, September 20, 2024
HomeతెలంగాణJanagama: చిన్న మడూరులో దుర్గ‌మ్మ పండుగ వేడుక‌ల్లో ఎర్ర‌బెల్లి

Janagama: చిన్న మడూరులో దుర్గ‌మ్మ పండుగ వేడుక‌ల్లో ఎర్ర‌బెల్లి

జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, దేవరుప్పుల మండ‌లం చిన్న మడూరు గ్రామంలో జ‌రిగిన రేణుక ఎల్లమ్మ పండుగ వేడుక‌ల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎల్లమ్మ త‌ల్లి గుడిలో పూజ‌లు చేశారు. గ్రామస్థుల‌కు ఎల్లమ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎల్లమ్మ త‌ల్లి గ్రామ‌స్థులంద‌రినీ చ‌ల్ల‌గా చూడాల‌ని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి చిన్న మడూరు గ్రామ ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, గ్రామ ప్ర‌ముఖులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News