Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభGurtunda Seetakalam : గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. ఫస్ట్ టైం సత్యదేవ్ లవర్ బాయ్‌గా..

Gurtunda Seetakalam : గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. ఫస్ట్ టైం సత్యదేవ్ లవర్ బాయ్‌గా..

- Advertisement -

Gurtunda Seetakalam : సత్యదేవ్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా, మేఘ ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా గుర్తుందా శీతాకాలం. కన్నడలో సూపర్ హిట్ అయిన ల‌వ్ మాక్‌టైల్ సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. పూర్తిగా లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా అందబోతుంది. నాగశేఖర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే అనేసాక సార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకి రానుంది.

తాజాగా గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూశాక మొదటి సారి సత్యదేవ్ లవర్ బాయ్ గా చేశాడు అని తెలుస్తుంది. హీరో లైఫ్ లో మూడు స్టేజిలలో ముగ్గురు అమ్మాయిలతో ఉండే ప్రేమ కథల్ని చూపించబోతున్నారు. చివరికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక గతంలో ప్రేమించిన అమ్మాయి మళ్ళీ హీరో లైఫ్ లోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతో తెరకెక్కినట్టు ఉంది.

మొదటి సారి సత్యదేవ్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ముగ్గురు అమ్మాయిలతో ప్రేమకథలు, రొమాన్స్ బాగానే నడిపాడు. సినిమా మొత్తం ఎక్కువగా ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రదేశాల్లో షూట్ చేసినట్టు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ లో విలన్ రోల్ తర్వాత పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న క్యారెక్టర్ తో సత్యదేవ్ ఈ సినిమాతో పలకరించబోతున్నాడు. దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News