కరీంనగర్ జిల్లా ప్రతిష్టను పతాకస్థాయికి ఎగరవేసేలా నిర్మిస్తున్న కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణపనులను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్, నగర మేయర్ లతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, అభివృది చెందుతున్న ప్రస్తుత పరీస్థితులకు అనుగునంగా, అత్యాదునిక హంగులతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనులు రాత్రింబవలు చేపట్టి, ప్రారంబించడానికి సిద్దం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, మేయర్ వై. సునీల్ రావు, ఇరిగేషన్ అధికారి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.