Saturday, September 21, 2024
HomeతెలంగాణPaleru: దళిత వాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

Paleru: దళిత వాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

పాలేరు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం పాపిట్ల సత్యనారాయణ అధ్యక్షతన స్థానిక ఎన్నేస్పి క్యాంప్ లోని మంచికంటి భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తూ దళితులను మోసగిస్తున్నదని, తక్షణమే దళితవాడల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తూ రాజ్యాంగాన్ని బలహీనపరచాలని చూస్తుందని రాజ్యాంగ పరిరక్షణ కోసం దళితులందరూ కంకణ బద్దులు కావాలని రాజ్యాంగం కల్పించిన హక్కుల అమలు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. పాలేరు నియోజకవర్గంలో ఖాళీ జాగాలున్న ప్రతి దళిత కుటుంబానికి పక్కా ఇండ్లు మంజూరు చేయాలని, పొజిషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని అట్లాగే దళితవాడలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, దళిత బంధు పథకాన్ని ప్రతి దళిత కుటుంబానికి వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాలలో దళితులను అంటరానివాళ్ళుగా చూస్తున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దళితులందరూ ఐక్యంగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. పాలేరు నియోజకవర్గంలో దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రత్యేక నిధుల కోసం మరో పోరాటం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్, జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్, రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్, కెవిపిఎస్ జిల్లా నాయకులు కొమ్ము శ్రీను, నాగాటి సురేష్ కుక్కల సైదులు, పుట్టల ఉపేందర్, పల్లి రమేష్, కర్ణ బాబు, మైకు బాబు, పగిడికత్తుల నాగేశ్వరరావు, వర కుమార్ నందిగామ కృష్ణ, మునిగంటి యాదగిరి, రామనాదం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News