Saturday, November 23, 2024
HomeతెలంగాణManchiryala: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం రిలే దీక్షలు

Manchiryala: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం రిలే దీక్షలు

ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇండ్ల స్థలాలు అందించాలనే డిమాండ్ తో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్థలో నిరవధిక దీక్ష కార్యక్రమం చేపట్టారు జర్నలిస్టులు. ఈ దీక్షకు వివిధ జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్ట్లు రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్, గొపతి సత్తయ్య మాట్లాడుతూ… సమాజహితమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వం ఏర్పాడ్డాకా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి స్థలాలు అందిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. కేసీఆర్ పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. కానీ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇంటి స్థలాల కేటాయింపు జరగడం లేదని, వాటి ఊసే లేదని పేర్కొన్నారు. దీంతో అనేక ఏండ్ల నుంచి జర్నలిస్టులు అద్దె ఇండ్లలో ఉంటూ ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వంనకు ప్రజలకు మధ్య వారధిలాగా శ్రామిస్తున్నారని గుర్తుచేశారు. ఇంటి స్థలాల విషయమై అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు కూడా పలుమార్లు వినతిపత్రాలు అందించామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని వివరించారు.

- Advertisement -

రాష్ట్రంలో పలుచోట్ల జర్నలిస్టులకు స్థలాలు కేటాయించారని మంచిర్యాల జిల్లాలోనూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందజేయాలని కోరారు. ఈ దీక్షలకు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీ.శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి లాల్ కుమార్, హెచ్ ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్, సీపీఐ (ఎం) జిల్లా నాయకులు ప్రకాష్ , కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నీలకంటేశ్వర గౌడ్, కర్రే లచ్చన్న, ఐఅర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నైనాల వెంకటేశ్వర్లు, జయరావు, సీనియర్ జర్నలిస్ట్ లు అర్షనపల్లి రాజేష్, రమేష్, సత్యనారాయణ, ఎస్సీ , ఎస్టీ జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు ఆవుల శ్రీధర్, ఏబీజెఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్ల రాజశేఖర్, మల్లేష్, మధునేష్, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు తో మల్లేష్ యాదవ్, సెక్రెటరీ గోపతి సత్తయ్య,వెంకటస్వామి,క్యాతం రాజేష్, అత్తె సాగర్, ప్రభాకర్, లద్దూరి రమేష్, తలారి సమ్మయ్య, గొర్రె లక్ష్మణ్, శ్రీనివాస్, రాజ్ కుమార్, కొట్టే సురేందర్, బుద్దే రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News