మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రేఖరరావు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో బాగంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కంటి పరీక్ష చేయించుకున్న సిబ్బందితో మాట్లాడారు. డ్రైవర్ గా విధులు నిర్వర్తించే క్రమంలో కంటి చూపు స్పష్టం గా కనపడటం ఎంతో అవసరం అన్నారు. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్ తో పాటు వాహనంలో ఉన్న సిబ్బంది, అధికారుల ప్రాణాలు డైవర్ల చేతిలో ఉంటాయని అన్నారు.
వాహనాలు రాష్ డ్రైవింగ్ చేయకూడదని అన్నారు. అవసరానికి మించి పోలీస్ సైరన్ వాడకూడదని అన్నారు. విధులతో పాటు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి తప్పకుండా ఫుల్ బాడీ చకప్ చేయించుకోవడం మంచిది అని అన్నారు.
తాము పోలీస్ వాహనం నడిపే విధానంతోనే ప్రజలలో వాహనానికి, తెలంగాణ పోలీస్ శాఖకు మర్యాద పెరుగుతుందని అన్నారు. ఈరోజు మొత్తం 65 మంది డ్రైవర్ సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.కంటి చూపు సమస్య ఉన్నవారు కళ్లద్దాలు తప్పనిసరిగా వాడాలని అన్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్.ఐ (ఎం.టి.ఓ ) పూర్ణ చందర్, అర్.ఐ సురేష్ ఉన్నారు.