Tuesday, April 8, 2025
Homeనేషనల్Flight Booked for Wedding : సోదరి వివాహం కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసిన...

Flight Booked for Wedding : సోదరి వివాహం కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసిన యువతి

భారతీయ వివాహాలు చాలా ఆడంబరంగా.. అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలంకరణలోనే ఆహార్యం ఉట్టిపడేలా రెడీ అవుతారు. పెళ్లంటే చాలు.. ఎక్కడా రాజీ పడకుండా వచ్చిన బంధువులకు గౌరవ,మర్యాదలు చేస్తారు. కానీ కరోనా సమయంలో చాలావరకూ శుభకార్యాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ ఆంక్షలన్నీ తొలగిపోవడంతో..ఇటీవల కాలంలో ఈ ధోరణి మరింత ఎక్కువైంది. ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు. మర్యాదలకు లోటు ఉండకూడదన్న భావన ఎక్కువైంది.

- Advertisement -

కరోనా మునుపటి పరిస్థితులు రావడంతో.. పర్యాటక ప్రదేశాలు, పెళ్లి మంటపాలు, ప్యాలెస్ లు అన్నీ తెరచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జంట వివాహం కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి విమానంలో పెళ్లికి బయలుదేరింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రేయా షా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తన సోదరి వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత విమానంలోని వారందరినీ చూపించారు. చివర్లో పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటను చూపించారు. శ్రేయా షా చెబుతున్న దాని ప్రకారం ఆ జంట వివాహం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

https://www.instagram.com/reel/CllI2cXK2mW/?utm_source=ig_embed&ig_rid=fd5e5623-af8b-47b5-aa6b-024a27267ee1

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News