Saturday, April 19, 2025
HomeతెలంగాణErrabelli: పాలకుర్తిలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

Errabelli: పాలకుర్తిలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

పాలకుర్తిలో పాటి మీది ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి కావలసినన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో గుడి నిర్మాణం పూర్తి చేసుకొని ఇప్పుడు నిర్వహిస్తున్న హనుమాన్ ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించాలని సూచించారు. దేవుడికి అందరూ సమానమేనని, అయితే కొందరు దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి వారిని ఇలాంటి ఉత్సవాలకు దూరంగా పెట్టాలని మంత్రి చెప్పారు. దేవుడికి చేసే ప్రతి మంచి పని మనకు, మన పిల్లలకు ఉపయోగపడుతుంది అన్నారు. పాలకుర్తిలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయం నుంచి ప్రధాన రహదారి వరకు మంత్రి శోభా యాత్రలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, దేవస్థానం చైర్మన్, ధర్మకర్తలు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News