Friday, September 20, 2024
HomeతెలంగాణTanduru: సొంత పార్టీలోనే విమర్శలు

Tanduru: సొంత పార్టీలోనే విమర్శలు

నువ్వా నేనా అంటూ రణరంగంగా మారిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వర్గీయులు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రోజురోజుకు బిఆర్ఎస్ సొంత పార్టీలో ఉన్న నేతలు ప్రెస్ మీట్ లు పెట్టి ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ వర్గీయులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు పార్టీ ప్రతిష్టను చెడగొడుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం తాండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వర్గీయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ తాండూర్ పట్టణ అధ్యక్షులు నయుం అఫ్ఫు మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు వచ్చి తాండూర్ ని ఏం అభివృద్ధి చేశారు. వచ్చిన ప్రతి నాయకుడు వారి సొంత లాభాలను చూసుకుంటూ వాళ్లని వాళ్లు అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు. గత సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఇప్పుడు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మన తాండూర్ ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తూ.. మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి వార్డుకి కోటి రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేసి తాండూర్ లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తున్నాడు. ఈ అభివృద్ధి చూసి ఓరువలేక ఈ ఎమ్మెల్సీ వర్గీయులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు. మహేందర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటి వాటికి ప్రూఫులు ఉంటే ఒకసారి చూపెట్టండి మహేందర్ రెడ్డి పాలనలో మొత్తం చేవెళ్ల నే అభివృద్ధి చేసుకున్నాడు తప్ప తాండూరు అభివృద్ధి ని పట్టించుకోలేదు అని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతివార్డుకు పార్టీలకు అతీతంగా కోటి రూపాయల నిధులు అభివృద్ధి కోసం మంజూరు చేస్తే.. అవి చూసి ఓర్వలేక ఎమ్మెల్సీ వర్గానికి చెందిన వారు ఇష్టానుసారంగా ఎమ్మెల్యేను విమర్శించడం ఎంతవరకు సమంజసంమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ సమావేశాలకు ఆహ్వానించిన కక్షపూరితంగా సమావేశాలకు హాజరు కావడం లేదని అన్నారు.
ఓకే పార్టీలో ఉండి పార్టీ పరువు తీస్తున్నందుకు ఈ దృష్టిని అదీష్టానం వరకు ఈ విషయం తీసుకెళ్లి పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నిధులు కేటాయించడంతో ఎమ్మెల్సీ వర్గీయులు ప్రజలలో ముఖం చూపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నందున ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తున్నారు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ లీడర్లు కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News