Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభPawan Kalyan : సాహో ద‌ర్శ‌కుడితో ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Pawan Kalyan : సాహో ద‌ర్శ‌కుడితో ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Pawan Kalyan : ఓ వైపు రాజ‌కీయాలు మ‌రో వైపు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వ‌స్తున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ అనే చిత్రంలో ప‌వ‌న్ న‌టిస్తున్నాడు. శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. ఈ చిత్రం పూర్తి కాక‌ముందే మ‌రో సినిమా అప్‌డేట్ చెప్పేశాడు. డీవీవీ ఎంట‌ర్‌టైన‌ర్స్ ప‌తాకంపై దాన‌య్య నిర్మిస్తున్న సినిమాలో ప‌వ‌న్ న‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆదివారం ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ తెలియ‌జేసింది.

- Advertisement -

ఈ చిత్రానికి ‘ర‌న్ రాజా ర‌న్‌’, ‘సాహో’ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్నాడు. పోస్ట‌ర్ మొత్తం ఎరుపు రంగులో ఉంది. THEY CALL HIM #OG అని రాసి ఉంది. ప‌వ‌న్ నీడ ఒక గ‌న్ లాగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్‌ను చూస్తుంటే ఓ గ్యాంగ్ స్ట‌ర్ మూవీ అని అర్థం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఒక్క పోస్టర్‌తోనే చిత్ర‌బృందం సినిమాపై అంచ‌నాల‌ను భారీగా క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News