Saturday, October 5, 2024
HomeతెలంగాణCV Anand: ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

CV Anand: ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్ స్పష్టం చేశారు. ఫిట్ కాప్ యాప్ ద్వారా ఆరోగ్యం మెరుగుపరుచుకున్న 60మంది సిబ్బందిని ఆయన ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధులు సమర్ధవంతంగా నిర్వహించడానికి శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమన్నారు. అందుకోసం ఫిట్ కాప్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చి మంచి ఫలితాలను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోషకాహారం తీసుకోవాలని, బరువును తగిన విధంగా ఉంచుకోవాలని సూచించారు. కుటుంబంలో కూడా ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచాలని తెలిపారు. అందుకు తగిన ప్రోత్సాహాన్ని ఇస్తామని స్పష్టం చేశారు. హై రిస్క్ కేటగిరీలోని పోలీసు సిబ్బంది సాధారణ స్థితికి రావడం ఆనందంగా ఉందన్నారు. యాప్ భాగస్వామ్యంతో ద్వారా పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ గజరావు భూపాల్, డీసీపీ సునీత రెడ్డి, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ టీమ్ హెడ్ ముజ్తబా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News