Friday, October 18, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: ఆ కవిత్వం కాళ్ళకు చిరు మువ్వలుంటాయి

Telugu Literature: ఆ కవిత్వం కాళ్ళకు చిరు మువ్వలుంటాయి

ఆధునిక సాహితీ వినీలాకాశంలో కొత్త కొత్త కవితానక్షత్రాలు ఎన్నెన్నో వెలుగుచూస్తున్న వాటి వెలుతురు సాంద్రతబట్టే నిగారిస్తాయి. నిలువరిస్తాయి నిలిచిపోతాయి, చెట్టు ముందా? విత్తు ముందా? అనే జవాబు లేని ప్రశ్న మాదిరి కవనానికి కావలసింది అర్థమా? శబ్దమా? అనే జంట ప్రశ్నలు వెంట వెంటనే వస్తాయి. ఎంత కవనపు బురుజు నురగలు పొంగిపొర్లినా అవి అన్ని మానవత్వపు పాలు నుంచేగా? మానవత్వంలో నుంచి పుట్టుకొచ్చిన అరటి పిలకలే మన ఆధునిక కవితా ప్రక్రియలనే మొగ్గలు, కవిత వస్తు సాధారణమైన వ్రాసిన కవి ప్రతిభా శైలి వల్ల పసిడికి పన్నీరు పూసిన చందం అవుతుంది తెలుగు సాహిత్య సరోవరానికి నిత్యం అనేక కవన వాగులు పయనం అయి తమ తమ ప్రవాహాలు సాగించిన పాఠకుల మనోసరోవరాలను చేరేవి కలకాలం నిలిచేవి కొన్ని మాత్రమే.!
ఎప్పుడు మొదలు పెట్టావు? అన్నది ముఖ్యం కాదు, ఎలా కొనసాగుతున్నావ్‌ అన్నది ప్రధానం, అన్న చందంగా ఆలస్యంగా కవనక్షేత్రంలో అడుగిడిన, రాశి కన్నా వాసికే అధిక ప్రాధాన్యతతో ఆధునిక కవితా రహదారిలో మును ముందుకు సాగుతున్న ఖమ్మం ధీరుడు మువ్వా శ్రీనివాస రావు, ఆయన కవిత్వం ఓ విలక్షణ బహుశా సావాస కారణం కావచ్చు తన మిత్రుడు డాక్టర్‌ సీతారాం సెలవిచ్చి నట్టు ప్రతి కవి తనదైన కవిత్వం కోసం ప్రత్యేకంగా ఒక కవిత్వ భాష ఏర్పాటు చేసుకోవాలి అన్నమాటలు, అక్షరాల ఆచరించి చూపిస్తారు ఆయన.
సాధారణంగా కవిత్వం అంటేనే ‘ఆగ్రహజ్వాలల కాంతిపుంజం’ అనుకుంటాము. దానికి వివిధ వాదాలు జోడై నిప్పుకు గాలి తోడైన తీరు సాగుతుంది. కానీ మువ్వా గారి కవిత్వం పాతవాసనలు అంటని కొత్త ప్రయోగాలతో శబ్దాల గలగలతో శ్రవణానంద దాయకంగా మనసుకు సంతృప్తిని పంచుతూ ముందుకు సాగుతుంది.
ఆయన ముచ్చటగా వ్రాసిన మూడో కవితా సంపుటి ‘వాక్యంతం’ విద్యాపరంగా తెలుగు భాషా విద్యార్థి కాక పోయినా తాను అధ్యయనం చేసిన వైజ్ఞానిక శాస్త్రం ద్వా రానే తెలుగు భాష లోతులు, సొగసులు, వడిసి పట్టిన నేర్ప రి అతడు, ఆ చతురత లక్షణాలు, వాస్తవదృష్టి, వాక్యాంతం నిండా విస్తరించాయి.
తనదైన శిల్పం, ప్రణాళిక సిద్ధాంతం ద్వారా రాసిన ఈ కవితల హారంకు వాక్యాంతం కవిత్వం అనే నవీన సిద్ధాంతం ఆపాదించారు. వస్తువు కూడా ఇది మాత్రమే అని నిర్దిష్టంగా నిలపలేదు, కాదేది కవితకు అనర్హం అన్న అతడి అభిమాన కవన గురువు శ్రీ శ్రీ వాక్కులు ఆచ రించారు.
కవితల నిండా పరుచుకున్న ఆధునిక ఆంగ్ల పదజా లంకు తోడు అందమైన వాస్తవికతలు తోడై చదువరులకు ఒక నూతన అనుభూతి అందుతుంది. సాధారణ విష యాన్ని అసాధారణంగా హత్తుకుపోయేట్టు చెప్పి చూపిం చడం ఈ కవికి హార్లిక్స్‌ తో పెట్టిన విద్య.
‘కొత్త దుఃఖం’తో మొదలుపెట్టి ‘పద్యాంతం’తో ముగి సిన ఈ వాక్యాంతం 174 కవితా సుమాలను పొదివి పట్టిన ‘సుదీర్ఘ కవితా సుమమాల’ కేవలం మానవజాతికే సొంతమైన వివాహ వ్యవస్థ గురించి దంపతుల విలువలు గురించి కవి చెప్పిన వాక్యాలు ప్రతి మనిషిని నిలుచుని ఆలోచింపజేస్తాయి నిజంగా భారతీయ సమాజానికి వివా హ సంస్కృతి, పెట్టని కోటలా ఉండి నిరంతరం యువత రాన్ని పహారా కాస్తుంది. ‘పెళ్లి’ అంటే అతను ఆమెగా మారడం ఆమె అతను కావడం, అని రెండు సాధారణ వాక్యాలు ద్వారా ఎంతో లోతైన భావాన్ని ,సందేశాన్ని భావితరాలకు అందించారు.
ఇలాంటి ఆలతి అలతి పదాలే కాదు ‘ఇరువురు కలసి సంతకం చేస్తే తప్ప/ చెల్లని బతుకు చెక్కు బుక్కై పోవడం’ అని నర్మగర్భమైన, ఆలోచింపజేసే వాక్యాలకూ కొద వుం డదు, జీవిత నాటక రంగంపై ఆలుమగలు అనే ప్రధాన పాత్రల ఔన్నత్యం జీవించి పోషించాల్సిన పాత్రల బాధ్య తలు నవ్య రీతిన ఆవిష్కరించారు ‘పెళ్లి@’ కవితలో …..
మువ్వా భాషలో ఆ అత్యాధునికత నిగారించిన అతని ఆలోచనలన్నీ ఆపాత మధురాలే అనడానికి చక్కని ఉదాహరణ ‘చివరి నుంచి మొదటికి’ కవిత, సమాజంలో నెలకొన్న అనైక్యతలకు, ఆగ్రహవేశాలకు మూల సూత్రాలు అవుతున్న ‘కుల కుతంత్రాలు’పై కవి ఆగ్రహం చూస్తే ఔరా!! అనిపిస్తుంది,
‘కాలం అంచుల వెంట/ కులం కుతంత్రం మొదలైన రోజు దాకా/ నడిచి పోదాం/ ఆనాటిని నేటితో హత్య చేసి/ భుజానేసుకుని/ బట్టల్లేని బతుకుల్లోకి మోసుకుపోదాం… అంటూ ఆదిమానవుని కాలంలోనే కులమతాల భేదాలు లేకుండా మానవ జీవితం హాయిగా గడిచింది అన్న భావా న్ని తనదైన సున్నిత వ్యంగ్యనాదంతో చెప్పడంలో కవిలోని ఆధునిక యుగంపై గల అసహనంఅర్థమవుతుంది.
సుదీర్ఘ వాక్యాలతో అర్థం కాని పదాడంబరాల విన్యా సాలతో, తరచి అర్థాలు వెతుక్కుని అనిపించిన దానితో అన్వయించేసుకుని , అదే అద్భుత కవిత్వం అని భుజాలు ఎగరేసుకునే ఆధునిక కవి వరేణ్యులకు మువ్వా కవిత్వం నిజమైన జ్ఞానోదయమే…!!
అలతి అలతి పదాలతో అందమైన భావాలు సింగా రించి అద్భుతమైన అనుభూతి సందేశాలు అందించేవే మువ్వా గారి కవన మయూరాలు అనడానికి మంచి ఆధా రం ఈ ‘చిల్లు చీటీ’, ఆనాడు ఏనుగు లక్ష్మణ కవి తన సుభాషిత త్రిశతిలో మానవ స్థితిని బట్టి అతని గుణగణాలు నిర్ధారించడానికి ‘నీటిబొట్టు’ను ఎంచుకున్నట్టు ఈనాడు ఈ మువ్వాకవి ‘చిల్లు’ అనబడే రంద్రాన్ని నేటి కాలానికి అన్వయించి ఎంతో హృద్యంగా అదే భావాన్ని సొంతంగా గుర్తు చేశారు.
అది చిల్లే/ అదొట్టి రంధ్రమే/ వెదురు బొంగుపై ఉంటే/ స్వరానికి తల్లవుతుంది/ ఓజోన్‌ పొరపై ఉంటే/ ఊపిరి తీసే విల్లవుతుంది. అంటూ తనదైన చమత్కారం పూసి పువ్వుల బాణం వదిలారు హెచ్చరికలు కూడా ఎంత చక్కగా చేయవచ్చో ఇలాంటి కవితా పంక్తుల ఆస్వాదన ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఈ కవితాలతల నడుమ మానవ హృదయనేత్రం విప్పార్చి నడకలు సాగిస్తుంటే ఈ ‘వాక్యాంతం’ ఎవరి కోసం? ఎందుకోసం? కవి తన ఆవేదన తీర్చుకోవడానికి రాసుకున్న సొంత గొడవ? అని అప్పుడప్పుడు అనిపిం చిన ఆ సాంతం చదివాక తప్పకుండా మన ఆలోచన తీరు మార్చుకుని తీరుతాం.
ఇది మువ్వా స్వీయ గొడవలోని సామూహిక సంవే దన చిత్రపటం, ఆధునిక కవిత్వానికి అంతం ఈ ‘వాక్యాం తం’. ఈ కవన బింధువులు కురిపించే క్రమంలో ‘కవి’ జల ధార అయిపోయి పాత్రోచిత న్యాయం పాటిస్తూ అబ్బుర పరుస్తూ ఆలోచింపజేస్తూ బహుముఖీయమైన బహుపత్రా భినయం చేస్తాడు.
కవి సొంత గొడవ అనిపిస్తూ ప్రారంభమైన కవితా పంక్తుల ప్రయాణం చివరికి వచ్చేసరికి ఇది ‘నా గొడవ’ కూడా అని ఎవరికి వారు సంతృప్తి చెందక మానరు.
నిజంగా మువ్వా గారి కవితా వాక్యాల్లో ‘అదృశ్య శబ్దార్థశక్తి’ దాగి ఉంది, అందుకే ఆ కవిత్వం చదువుతు న్నంత సేపు ఏదో తెలియని నవ లోకంలో ‘నిజం కళ్ళ జోడేసుకుని పరుగు లాంటి నడకలు నడిచేస్తాం’ విషయం, కేంద్ర బిందువు, ఒక్కటే అయినా చెప్పే ప్రతిసారి అదే విష యాన్ని కొత్తగా మరికాస్త బలంగా చెప్పడమే ‘మువ్వా’ కవి త్వంలో ప్రాథమిక లక్షణమే కాదు, ప్రతి వ్యక్తి అనుసరిం చాల్సిన ఆదర్శ లక్షణం కూడా.
‘మువ్వా’ ఎంచుకున్న కవిత్వం లాగే అతని కవిత్వా నికి ప్రత్యేక భాష, వ్యాకరణం, ఎంచుకున్నారని పిస్తుంది, చక్కని పద చిత్రాలు, ఎంచక్కని పదబంధాలు, ఆధునిక ప్రాచీనతల కలబోతల కల నేతలతో అల్లిన ఈ కవన వస్త్రాలు వేటికవే మేలైనవి, అందమైనవి కూడా!!
గాజు పూలపాన్పు, ఓకే ఇద్దరు, వక్రస్వరాలు, నీలోం చి నువ్వు, నేల పడవ, నిశ్శబ్దలిపి, అక్షరామని, నడిచే సముద్రం, వంటి కవితా శీర్షికలే కవిలో నవీన దృక్పథా నికి దారులు చూపిస్తాయి. చూసినవారికి చూసినంత చది విన వారికి చదివినంత, అన్నట్టు ఈ కవితలను సాధారణ అక్షువులతో గాక, విశ్లేషణాత్మక నేత్రాలతో పరిశీలిస్తే తాత్విక విచికిత్స, అంతర్మదనం,చింతనాత్మక సంవేదన ఒకదానికి ఒకటి పెరవేసుకుపోయినట్టు కూడా ‘వాక్యా తం’ లోని ‘కవితాంతాలు’ ఆగుపిస్తాయి.
‘ఓప్రతిభావంతమైన శిల్పించేచెక్కబడిన సజీవ శిల్పం’ అనే చిన్న అభినందన వాక్యం ఈ ‘వాక్యాంతానికి’ వంద విశ్లేషణల సమానంగా సంతృప్తి పడుతూ, ‘వాక్యాంతం కవిత్వం’ అన్న ఈ ఆధునిక విశ్వనాథునికి వినమ్ర విజయాభినందనలు.

  • డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు
    77298 83223
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News