Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Chandamama Kathalu: నిండు పౌర్ణమి వెలుగులు నింపే చందమామ కథలు

Chandamama Kathalu: నిండు పౌర్ణమి వెలుగులు నింపే చందమామ కథలు

సెల్‌ ఫోనే స్నేహితుడు వాట్సప్‌ యాప్‌ అంత ర్జాతీయ విశ్వవిద్యాలయంగా మారి విజృంభిస్తున్న ఈ రోజులలో తరాల మధ్య భేదం అగాధాలుగా మారి పూడ్చలేనటువంటి భావ కొరతకు తెర లేపింది, అభిప్రాయ భేదాలు చిక్కుముడిగా మారి బతుకును వెతుకులాటగా మార్చింది. సరళీకరించుకోవాల్సిన జీవితం సంక్లిష్టంగా మారింది. నీతి నియమాలు విలువలు నిమ్నికరించే నూతన వ్యవస్థ నిర్మితమైంది.
తాత మనవడు మధ్య మాధ్యమము మారి పోయింది. ఇంగ్లీష్‌ చదువులతో కార్పొరేట్‌ విద్య కొండెక్కి కూర్చుంది. ఆదికవి నన్నయ భాష అడుగంటి పోయింది. అలిశెట్టి భాష శ్వాస తీసుకోలేక తికమక పడుతుంది. విదేశీ భాషకు భజన పరులు ఎంతమంది ఉన్నా తేనే లాంటి తెలుగు భాషకు స్వచ్ఛమైన సృజన పరులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరు చందమామ కథలు రచయిత బూర్లె నాగేశ్వరరావు గారు. నిండు పౌర్ణమి లాంటి వ్యక్తిత్వం తో కోహినూర్‌ వెలుగులు విరజిమ్ముతున్న బూర్లే నాగేశ్వరరావు గారు కథలు నడిపించే తీరు చూస్తుంటే కాచి వడపోసిన అమృత సారము అందరికీ పంచుతున్నారు అనడంలో అతిసయోక్తి ఏమీ లేదు.
ప్రపంచానికి కధా సాహిత్యం అందించిన ఘనత భారతీయులు అని చెప్పడంలో నిస్సందేహంగా సందేహం అవసరం లేదు. చందమామ కేవలం పిల్లల పత్రిక అనుకుంటే తప్పే అవుతుంది. చిన్న వాళ్ళ దగ్గర నుండి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే పత్రికా చందమామ. చందమామ సృష్టికర్తలు నాగిరెడ్డి, చక్రపాణీలు కథలలో ఎక్కడ సాంగికం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. వ్యాపార ప్రకటనలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. అర్ధరూపాయి షాంపూకి ఆరు నిమిషాలు యాడ్‌ రూ పొందించే మార్కెటైజేషన్‌ ప్రపంచంలో ఉన్నాం మనం.
కొద్దిసేపు చందమామ కథల్లోని అక్షరాలతో ఆడు కుందాం చక్కెర గుళికలు లాంటి చందమామ కథలు తో చక్కర్లు కొడదాం. ఖఖగుమ్మడికాయల దొంగ ఖౠ అనే కథలో దొంగను పట్టించిన తీరు అత్యంత నాట కీయంగా అనిపించింది. 5 పాత్రలతో ఉన్న ఈ కథ 5జీ తరం కూడ చదవాల్సిన కథ. వ్యాపార దృష్టి ఎంత మానవీయంగా ఉండాలి అని చెప్పడమే కాదు, ఆపదలో చిక్కుకున్న వ్యాపారస్తుడిని, న్యాయాధిశుడు బుద్ధిబలం తో బయటపడేసిన తీరు చూస్తుంటే ఆద్యంతం అమో ఘం, అద్భుతంగా అనిపిస్తుంది.
ఈ కథలో సంక్షిప్తత ఏకాంశవ్యగ్రత, నిర్భరత, స్వయం సమగ్రత అన్నిటికీ మించి సంవాదఛాతుర్యం బాగా పండింది. న్యాయాధిశుడు సూక్ష్మ బుద్ధి ని ఆక లింపు చేసుకుంటే కథా బలం కళ్ళముందు కమనీయం గా అక్షర రమణీయంగా అనిపిస్తుంది. రాయి పడగానే తల ముడుచుకునే తాబేలు మనస్తత్వం వదిలి గుండె నిండా గుప్పెడంత ధైర్యాన్ని నింపుతుంది.
పట్నంలో వ్యాపారం అనే కథలో యువకులలో పట్నంపై మోజును కళ్ల కట్టినట్టుగా కనువిప్పు కలిగే టట్టుగా చిత్రించాడు. ప్రాచీన హరప్ప నాగరికత పట్టణ నాగరికత, ఆ తరువాత వెలసిన ఆర్య నాగరికత పచ్చ దనం, పరిమళాలు వెదజల్లిన పల్లె నాగరికత. అందు చేతనే నేటికి మనభారతదేశం పల్లె పట్టణ నాగరికతతో వెలుగుతుంది. కరోనా విపత్తులోభారత ఆర్థిక వ్యవస్థను కాపాడింది పల్లెలేని చెప్పటంలో సందేహం అవసరమే లేదు. తారు రోడ్డు కారు ప్రయాణంఅభివృద్ధి అనుకునే వెలుగు జిలుగుల డొల్లతనాన్నితెలియజేసింది.
పట్నంలో వ్యాపారం అనే కథలో నాలుగు పాత్ర లతో పట్నం మోసకారితనాన్ని గుట్టు విప్పాడు ఇతరులు మేలే మన మేలని చెప్పే వ్యాపార సూత్రాన్ని చిన్నయ్య శెట్టి తన చిన్న కొడుకు కాశీపతికి తెలియజేప్పే తీరు చూస్తుంటే కొడుకు పై తనకున్న గురుతర బాధ్యతను భారతదేశ సంస్కృతిలో తండ్రి కొడుకు మధ్య అనిర్వచ నీయమైన అనుబంధాన్ని సందర్భోచితంగా చెప్పినట్టు అనిపించింది. ఈ కథ చదువుతుంటే బూర్లే.నాగేశ్వరావు గారి పదాలపై పట్టు కథపై ఉన్న బిగువును తెలియ జేస్తుంది. భారతదేశ సంస్కృతిలో మెచ్చుకోదగ్గ విషయం వివాహ వ్యవస్థ అందుకనే భారతదేశ సంస్కృతికి దేశ విదేశాలు జై జై ధ్వనాలు పలుకుతున్నాయి. భారతదేశ వివాహ వ్యవస్థలో అనేక రకాల ఉన్నాయి.
కానీ కంప్యూటరీకరణ వ్యవస్థలో మావిడాకులు ఆరకముందే విడాకులు పొందే విషయ వలయ సం స్కృతికి బీజాలు పడుతూనే ఉన్నాయి. ఆర్థికంగా పరి పుష్టం చేసే ఆర్థిక వ్యవస్థ ఉండటం అసలు మూల కారణం. వ్యర్థమైన పరీక్ష అనే కథలో ప్రాచీన కాలం నాటి రాజులు పరిస్థితులు కళ్లకు కట్టినట్టుగా కధ అల్లిన తీరు కళాత్మకం. చంద్రగిరి రాజు రవి వర్మ తన కూతురు సువర్ణ కుమారికి స్వయంవరం ప్రకటిస్తాడు. ఆమె యుద్ధ విద్యలో నేర్పరి స్వయంవర వివాహ వ్యవస్థలో పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎత్తిచూపుతూ బూర్లే. నాగేశ్వర రావు గారు కథ అల్లిన తీరు పాఠకులను మరింత ఆకట్టు కుంది. పాత్రల సృష్టి అత్యంత సహజంగా ఉండటం కథను నడిపించే తీరులో పాఠకుని ఉక్కిరిబిక్కిరి చేయటం ఈ కథ రచయితకు వెన్నతో పెట్టిన విద్య.
విక్రమార్కుడు, శవం మధ్య సంవాద చాతుర్యం, ఎక్కడ చిక్కకుంటా చిక్కు ప్రశ్నలకు సమాధానాలు చెప్ప టం కథను పరిగెత్తించిన తీరు వారి కళాబలంను తెలి యజేస్తుంది. 45 ఆణిముత్యం లాంటి కథలతో ఉన్న ఈ కథ పుస్తకం మన మస్తిత్వానికి పదును పెట్టి, ఏ వీడియో గేమ్‌లో తెలియజేయని విశాల మనసును ఆవిష్కరి స్తుంది. నేత్రాలకు చక్కని నేస్తంగా ఉంటూ కళ్ళజోడు భారాన్ని పక్కకు నెట్టేస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మంచి వ్యక్తిత్వానికి పూలదారులు పరుస్తుంది. ప్రతి కథ విభిన్నంగా ఉంటూ అక్షర విన్యాసాలు చేయిస్తుంది. పదాలు పక్కన కూర్చొని హితబోధ చేస్తాయి. చంద మామ కథ రచయిత మరియు చక్కని బొమ్మలతో తీర్చి దిద్దిన చిత్రకారుడు శక్తి దాసు గారు మన అందర్నీ మరో ప్రపంచంలో విహరింప చేస్తారు. అమ్మ చూపించిన చందమామను మరోసారి తెరిచి చూద్దాం ఈ పుస్తకం ప్రతి మదిలో ముద్రించుకోవాల్సిన పుస్తకం.
సాదే సురేష్‌

  • 9441692519
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News