దేవరకద్రలో 24 కోట్ల 67 లక్షలతో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని, నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. అనంతరం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్నారు వీరంతా. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. ఇప్పుడిప్పుడే పాలమూరు పచ్చబడుతోందని, పెండింగ్ ప్రాజెక్ట్ లను సీఎం కేసీఆర్ పూర్తి చేశారని, పాలమూరులో వేరే రాష్ట్రం నుండి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నది నిజం కాదా అన్నారు. సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ లో మొట్టమొదటి సమీక్ష పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద చేశారని ఆయన గుర్తుచేశారు. రేవంత్ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్న వేముల.. రేవంత్ తనకుతాను గొప్ప నాయకుడు అని ఊహించుకుంటున్నాడని, పిచ్చి మాటలు మానుకోవాలని రేవంత్ ను హెచ్చరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే లుగా, మంత్రులుగా పని చేసిన వాళ్ళు మళ్ళీ కొత్త వేషంతో ప్రజల ముందుకు వస్తున్నారని, కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తామంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రసంగం సాగింది.