Thursday, June 19, 2025
HomeతెలంగాణIllandukunta: గౌడ సంఘం ఆవిర్భావ వేడుకలు

Illandukunta: గౌడ సంఘం ఆవిర్భావ వేడుకలు

సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇల్లందకుంట మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షుడు సమ్మెట ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో కేకు కోసి మిఠాయిలు పంపిణీ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో యేండ్లుగా తీరని గీతా కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సదరు సమస్యలను పరిష్కరించాలని, గీతా కార్మికులకు సత్వరమే టూ వీలర్స్ , సేఫ్టీ మోకులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెరుమండ్ల రాజయ్య గౌడ్, గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు రావుల శివకుమార్ గౌడ్, గుర్రం రమేష్ గౌడ్, రావుల విజయ్ బాబు గౌడ్, మోటపోతుల దేవేందర్ గౌడ్, రఘు గౌడ్, సమ్మెట మొగిలి గౌడ్, రంగు సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News