Friday, October 18, 2024
HomeతెలంగాణKukatpally: పార్కులు, డ్రైనేజ్, రోడ్లపై మాధవరం సమీక్ష

Kukatpally: పార్కులు, డ్రైనేజ్, రోడ్లపై మాధవరం సమీక్ష

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో… కెపిహెచ్బి, బాలాజీ నగర్, అల్లా పూర్ కూకట్పల్లి డివిజన్లకు సంబంధించి పార్కులు, డ్రైనేజ్ రోడ్లు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా 17 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ.. అన్ని పార్కుల్లోని కాంపౌండ్ వాల్ నిర్మాణం పటిష్టంగా చేపట్టాలని … అలాగే పార్కుల్లో నిఘా కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటి ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.. మరో 20 ఓపెన్ జిమ్ లు మంజూరు చేశారు.. అలాగే పెండింగ్లో ఉన్న రోడ్లు త్వరితగతిని పూర్తి చేయాలని ఎక్కడైనా పైప్లైన్ల మరమ్మత్తులు జరిగి రోడ్లకు సంబంధించి ఇతర పెండింగ్ పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతూ ఎలక్ట్రిక్ పోల్స్ కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్న వేళ దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎక్కడెక్కడ విద్యుత్ దీపాలు వెలగడం లేదో మరియు పోల్స్ సమస్యలు ఉన్నాయో గుర్తించి దాన్ని పునరుద్ధరించాలని సూచించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలుస్తుందని.. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయకుండా అడిగినప్పుడల్లా నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తూ.. ఎంతో అభివృద్ధి చేశారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని ఇందుకు నిదర్శనమే పార్కులు ..వాకింగ్ ట్రాక్స్ ఇండోర్ షటిల్ కోర్ట్.. క్రీడా మైదానాలు మొదలైనవి అని తెలిపారు ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు.. జూపల్లి సత్యనారాయణ.. పగుడాల శిరీష బాబురావు మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్.. జిహెచ్ఎంసి అధికారులు DE గోవర్ధన్..ఆనంద్ Ee సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News