తెలంగాణ రాష్టంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబల్ బెదురూమ్ ఇల్లు, దళిత బంధు ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏర్పుల ఆనంద్ సంఘం సభ్యులు కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా… వేతనం లేని వృత్తి నిర్వహిస్తున్నారన్నారు. కుటుంబ బాధ్యత పేదరికాన్ని నెత్తిన మోస్తూ… ప్రజలతో మమేకమై కలం నీడలో కాలం వెలదీస్తున్నారని వారి ఆవేదనను రాతపూర్వకంగా అదనపు కలెక్టర్ తిరుపతిరావుకి వినతి పత్రం అందజేశారు. జర్నలిజం అంటే నల్లేరు మీద నడక అన్నారు. కత్తుల బోనులో కలం పట్టి స్పష్టమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేర్చుతూ… అప్రమత్తం చేసేవాడు జర్నలిస్టు అన్నారు. వీరుకి దశాబ్దాలుగా పేదరికంలో మగ్గుతూ కనీసం ఉండడానికి తనకంటూ ఇంటి స్థలం లేదన ఆవేదన వ్యక్తపరిచారు. కుటుంబంతో ఇరుకు గదుల్లో అద్దె ఇంట్లో ఉంటూ కాలం ఎల్లదీస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామజికంగా వెనుకబడిన దళితులకు దళిత బంధు పథకంతో ఆర్థికంగా చేయూతనిస్తుందన్నారు. ఈ పథకం దళితులకు ఆర్థికంగా నిలవడానికి మేలైన పథకం అన్నారు. జర్నలిస్టులకు ప్రత్యేక దళిత బందు పథకం అమలు చేయాలని సోమవారం రంగారెడ్డి జిల్లా అదనప కలెక్టర్ తిరుపతి రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.