Friday, October 18, 2024
HomeతెలంగాణCheryala: వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

Cheryala: వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వడగళ్ళ వర్షానికి నష్టపోయిన రైతులకు, కౌలురైతులకు ఎకరాకు 30వేల రూపాయల చొప్పున నష్టపరిహారంగా చెల్లించాలని కోరుతూ చేర్యాల జేఏసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘ప్రజావాణి’లోని జాయింట్ కలెక్టర్ ముజమిల్ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ కో చైర్మన్ పుర్మ ఆగంరెడ్డి మాట్లాడుతూ.. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వడగళ్ళ వానకు చేర్యాల, కొమురవెల్లి,ఉమ్మడి మద్దూరు మండలాలలో వరి పంట పూర్తి స్థాయిలో ధ్వంసమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని,కనీసం పశువులకు పశుగ్రాసానికి కుడా పనికి రానంత నష్టం జరిగిందన్నారు.మామిడి తోటలకు కూడా భారినష్టం జరిగిందని, క్షేత్ర స్థాయిలోని అధికారుల ద్వారా నష్టానికి సంబంధించిన పరిశీలన నివేదికలు కలెక్టర్ కు అందిన తర్వాత నష్టపోయిన ప్రతీ రైతుకు,కౌలు రైతుల సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోని ఎకరానికి 30 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని,కౌలు రైతుకు నేరుగా వారి ఖాతాలోకి జమ చేయాలన్నారు.మామిడి తోట రైతుల నష్టాన్ని అంచనా వేసి వారికి కూడా తగు సహాయం అందించి రైతంగాన్ని అన్ని విధాల ఆదుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పిటిసి దాసరి కళావతి,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్,చేర్యాల మాజీ సర్పంచ్ ఆవుశర్ల యాదయ్య,చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తడక లింగం గుప్తా,మాల మహానాడు జేఏసీ నాయకులు పుట్ట రాజు,రైతు సంఘం జిల్లా నాయకులు కత్తుల భాస్కర్ రెడ్డి,జింకల బాలమల్లు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News