Tuesday, September 17, 2024
HomeతెలంగాణTanduru: వడ్లు కొనుగోలు చేస్తాం

Tanduru: వడ్లు కొనుగోలు చేస్తాం

బషీరాబాద్ మండలం దామర్ చెడ్ గ్రామానికి చెందిన ఏకలవ్య ఫౌండేషన్ సంస్థ సీఈఓ కార్యవర్గ సభ్యులు సర్పంచ్ కలిసి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఫౌండేషన్ సంస్థ సీఈఓ మాట్లాడుతూ ఏకలవ్య ఫౌండేషన్ కింద ఉన్న గ్రామాలు రెడ్డి ఘనపూర్, కాశింపూర్, బాద్లపూర్, దామర్ చెడ్, కొత్లపూర్, అల్లాపూర్ గ్రామాలకు మా ఫౌండేషన్ తరపున రెండు సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ గ్రామాల్లో ఏకలవ్య ఫౌండేషన్ డైరెక్టర్స్ ఉన్నట్టు, ఈ సంవత్సరం మా సంస్థ నుండి వడ్ల కొనుగోలు చేయాలనుకుని ముందుకు వచ్చినట్టు వెల్లడించగా.. ఎమ్మెల్యే స్పందించి డిఎస్ఓతో మాట్లాడి చెప్తానని హామీ ఇచ్చారు. ఏకలవ్య వంటి సంస్థలు ముందుకు వస్తే రైతులకు మేలు చేసినట్లు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం నర్సిరెడ్డి, సీఈఓ వెంకటయ్య, డైరెక్టర్స్ బుచ్చిరెడ్డి, కృష్ణమూర్తి, హనుమంత్ రెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News