Karan Johar : రణబీర్ కపూర్, అలియా భట్ జతగా వచ్చిన బ్రహ్మ్స్త్ర మంచి విజయమే సాధించింది. అయితే డబ్బులు మాత్రం రాలేదని టాక్ నడించింది. తాజాగా ఓ బాలీవుడ్ క్రిటిక్ బ్రహ్మాస్త్ర సినిమాపై, నిర్మాత కారం జోహార్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సినీ క్రిటిక్ కమల్ ఖాన్ తన ట్విట్టర్లో బాలీవుడ్ పై ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు.
తాజాగా కమల్ ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కమల్ ఖన తన ట్విట్టర్ లో.. బ్రహ్మాస్త్ర సినిమా ఫలితం, నష్టాలని చూసి కరణ్ జోహార్ కి ఏం చేయాలో అర్ధం కాలేదు. చాలా పెద్ద నష్టం వచ్చింది. దీంతో కరణ్ ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. అయితే అంబానీ కరణ్ కి 300 కోట్లు అప్పుగా ఇవ్వడంతో కూల్ అయ్యాడు. ఈ విషయాన్ని బయటకి చెప్పట్లేదు” అని పోస్ట్ చేశాడు. దీంతో కమల్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి. మరి దీనిపై కరణ్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.