Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: అవి తాగు నీరు కాదు విషం

Emmiganuru: అవి తాగు నీరు కాదు విషం

ఆ వాటర్ తాగితే డేంజర్. ఒకటి రెండు గ్లాసులు అయితే పరవాలేదు. మూడో గ్లాస్ తాగారు ఇక అంతే రోగాలు రావడం ఖాయం. పట్టణంలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా గంటా లేదా రెండు గంటల పాటు కుండపోత వర్షాలు రాత్రి వేళల్లో కురుస్తున్నాయి. దీంతో తాగునీరు కలుషితం అవుతోంది. నీళ్లు స్థానంలో కొత్తనీళ్లు వస్తున్నాయి.. మరి రోగాలు కూడా జనం పై దాడికి రెడీగా ఉన్నాయి. పట్టణంలో మున్సిపాలిటీ నీరు తాగాలంటే భయపడుతున్నారు ప్రజలు. శుద్ధి చేసిన నీటిని అందిస్తామంటూ పాలకులు, అధికారులు ఉత్త మాటలే చెబుతున్నారు కానీ ఆచరణలో మాత్రం శూన్యం. ఈమధ్య కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండిపోయాయి. వీటి ద్వారా ట్యాంకులకు ఫిల్టర్ బెడ్లకు, పంప్ హౌస్ లకు నీరు అలాగే చేరిపోతుంది. చేరిన నీటిని ఫిల్టర్ చేయకుండా అధికారులు నేరుగా ప్రజలకు పంపిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ నీటిని ప్రజలు తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు మరింత త్వరగా రోగాల బారిన పడుతున్నారు. దీంతో పట్టణంలోని ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇంట్లో ఒక్కరికి జబ్బు చేసిన ఇంటిల్లిపాదికి రోగాలు వ్యాపిస్తున్నాయి. అప్పో సప్పో చేసుకుంటూ ప్రైవేటు దావాఖానాలో వైద్యం చేయించుకుంటున్నామని ప్రజలు వాపోతున్నారు. నీటిని వేడి చేసుకుని త్రాగమని అధికారులు తూతూ మంత్రంగా ప్రచారం చేశారు. తాగే నీటిని ప్యూరిఫైడ్ చేయకుండా అలాగే పట్టణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు అధికారులు. దీంతో మురికి నీరే ప్రజల దాహార్తిని తీరుస్తుంది. మున్సిపాలిటీ మీరు ఎలా ఉన్నా సరే అలాగే తాగేస్తున్నారు. నీటిలో బ్యాక్టీరియా ఉన్నా కూడా ఇది తెలియని జనం ఆ నీటిని తాగుతున్నారు. కలుషిత నీరు మంచినీటి పైపులో కలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇదేమి పట్టకుండా అధికారులు మంచినీటి లో మురికి నీరు కలవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. బ్లీచింగ్ పౌడర్ కలిపి ఫ్లోరిడేషన్ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలు రోగాల బారిన పడే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలుషిత నీటిని కట్టడి చేసి మంచి నీటిని అందించాలని ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

వాటర్ ప్లాంట్ల దోపిడి :-
ప్రజలకు మురికి నీరు వచ్చిందని తెలుసుకున్న మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ఇదే అదురుగా చూసుకొని ధనార్జనే లక్ష్యంగా, అక్రమార్గమే ప్రధాన ఎజెండాగా భావించి ప్రజలను నిట్ట నిలువునా దోపిడీ చేస్తున్నారు. మున్సిపాలిటీ మీరు తాగితే రోగాలుస్తాయని ప్రజలు భయపడి వాటర్ ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. మినరల్ నీటిని తెచ్చుకుంటూ లేదా తెప్పించుకుంటూ తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్ లో పట్టణంలో ఉన్నాయి. సరైన నిబంధనలు పాటించకుండా తమ నీళ్ల వ్యాపారాలను దర్జాగా చేసుకుంటున్నారు వాటర్ ప్లాంట్ నిర్వాహకులు. ఒక లీటర్ వాటర్ బాటిల్ పది రూపాయలు, రెండు లీటర్ల వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు, 25 లీటర్ల వాటర్ కాను ముప్పై రూపాయలు ఇలా తమకు ఇష్టం వచ్చినట్టుగా ధరలు విధిస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు.

శుద్ధి చేసిన నీటిని అందించాలి :- రంగన్న, సిపిఐ పట్టాన కార్యదర్శి
ప్రజలకు మెరుగైన శుద్ధి చేసిన నీటినే అందించాలి. కలుషిత నీటిని తాగి ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారు.. ఆసుపత్రులకు డబ్బులు లేక అప్పులు చేసి మరి వైద్యం పొందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News