Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: విత్తనాల విక్రయ దుకాణాలలో తనిఖీలు

Nandavaram: విత్తనాల విక్రయ దుకాణాలలో తనిఖీలు

నందవరం మండల పరిధిలోని నందవరం, నాగలదిన్నే గ్రామాలలో విత్తనాల విక్రయ దుకాణాలలో సహాయ వ్యవసాయ సంచాలకులు మహ్మద్ ఖాద్రీ, మండల వ్యవసాయ అధికారి స్రవంతి తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు వచ్చిన విత్తన స్టాక్ ను పరిశీలించి అలాగే దుకాణాల అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనాలను విత్తన తయారీ సంస్థలు నిర్ణయించిన ధరకే (యం.ఆర్.పి) విక్రయించాలని, రైతులు విత్తనాలు కొనుగోలుకు వచ్చినప్పుడు ఒక రకం విత్తనంకి ఇంకొక్క రకం విత్తనం లింక్ గా ఇవ్వరాదని, విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతులకు బిల్ తప్పని సరిగా ఇవ్వాలని, రైతులకు వారి వారి పొలం బట్టి విత్తనాలను ఇవ్వాలని విత్తన విక్రయ దారులను సూచిస్తూ… నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మే నెలలో ఉన్న ఆదిక ఉష్ణోగ్రత వలన విత్తన మొలక శాతం తగ్గి, ఆకులు ఎర్ర బడి రైతులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్తి విత్తనాలను మే నెలలో నాటుకోవద్దు అని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి సిబ్బంది సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News