స్పందనకు వచ్చిన అర్జీలను విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని, కర్నూలు జిల్లా ఎస్పీ బి. కృష్ణకాంత్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బి. కృష్ణకాంత్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందనకు వచ్చిన వినతులు స్వీకరించి ఫిర్యాదిదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ స్పందనలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదులన్నింటిని పరిశీలించి చట్ట ప్రకారం విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్పందన అర్జీలపై సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతి పరిష్కరించాలని ఆదేశించారు. కుమారుడు అన్నం పెడుతుంటే మనుమళ్లు, కోడలు అడ్డు పడుతున్నారని పెద్దటేకూరు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, తన భర్త చనిపోయాడని, పిల్లలకు రావాల్సిన ఆస్తిని నా మరిది ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడని గార్గేయపురంకు చెందిన రాములమ్మ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు వివిధ సమస్యలపై స్పందనకు మొత్తం 87 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, లీగల్ అడ్వయిజర్ మల్లికార్జున రావు, సిబ్బంది పాల్గొన్నారు.
Kurnool: ‘స్పందన’ ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES