Friday, October 18, 2024
HomeతెలంగాణJammikunta: కలిసి బిఆర్ఎస్ జెండా ఎగరేద్దాం

Jammikunta: కలిసి బిఆర్ఎస్ జెండా ఎగరేద్దాం

హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాలను సోమవారం ఆయా మండల కేంద్రాల్లో వేరువేరుగా నిర్వహించారు. ఆయా సమావేశాల్లో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ శాఖ తో పాటు వివిధ రకాల అనుబంధ శాఖలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి గ్రామ శాఖలు, అనుబంధ శాఖలు కీలకమని అన్నారు. రాబోయే ఎన్నికల వరకు ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అనుకొని గ్రామాల్లో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో గ్రామ కమిటీ అనుబంధ కమిటీలతో పాటు గ్రామంలో వివిధ రంగాలలో ప్రముఖులు కుల సంఘాల ముఖ్యులు వారి వివరాలతో పాటు వారి సూచనలు సలహాలు పార్టీ బలోపేతానికి తీసుకోవాలని సూచించారు.
ఈనెల 16వ తేదీ వరకు హుజరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో పూర్తిస్థాయి కమిటీలు వేయాలన్నారు.
హుజరాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని అందుకోసం పాత కొత్త అనే తేడా లేకుండా తనకు అందరూ సమానమే అని అన్నారు
నియోజకవర్గంలో వ్యక్తిగత గ్రూపులకు తావు లేదని అందరం కేసీఆర్ గ్రూపు మనుషులమేనని అందరం బి ఆర్ ఎస్ పార్టీ జెండా కింద పనిచేయాలని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు పూర్తి అయిన వెంటనే మండల కమిటీలు సామాజిక న్యాయపరంగా వేయడం జరుగుతుందని అన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుల అనుమతితో మండల కమిటీలు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఆసక్తి ఉన్నవారు పార్టీకోసం కష్టపడి పని చేసేవారు ఆయా మండలాల ఎంపీపీ లకు జడ్పిటిసి లకు పేర్లు ఇవ్వాలని సూచించారు. బిఆర్ఎస్ పార్టీని ఇతర పార్టీల నాయకులు విమర్శించినప్పుడు పార్టీ నేతలు కార్యకర్తలు గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు మీడియా వేదికగా ఎక్కడికక్కడ ఖండించాలని దిశ నిర్దేశం చేశారు.
పార్టీ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇతర పార్టీలలో ఉన్న నాయకులను ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజల పరిస్థితి వివరించి వారికి కనువిప్పు కలిగేలా చేయాలని అని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా అందించాల్సిన బాధ్యత నియోజకవర్గంలోని ప్రతి బిఆర్ఎస్ సైనికుని పై ఉందని అన్నారు.
తాను ప్రతి నాయకునికి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ప్రతి గడపగడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల్లో జెండా ఎగురవేయడానికి నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటానని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News