విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వుల నూనెను తలకు రాసుకుని కొంచెం సేపైన తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
మందార ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించి కొంచెం సేపైన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కూడా జుట్టు ఊడదు.
ఉసిరి రసం తీసి తలకు రాసుకుంటే జుట్టు ఊడడం తగ్గడంతోపాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
దోస గింజలు ఎండబెట్టి దంచి నూనె తీసి, ఆ నూనెను నిమ్మరసంతో కలిపి తలకు రాస్తే కూడా వెంట్రుకలు ఊడటం తగ్గుతుంది.
చేమదుంపల రసం తలకు రాసుకుంటే కూడా జుట్టు ఊడడం తగ్గుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
నాలుగు టీస్పూన్ల కొబ్బరి పాలలో ఒక స్పూను నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి కొంచెం సేపయిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
షాంపులతో కాకుండా కుంకుడుకాయరసం లేదా షీకాయరసంతో తలస్నానం చేస్తే వెంట్రుకలు
దెబ్బతినకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. వెంట్రుకలు కూడా ఊడిపోవు. జుట్టు పెరుగుతుంది.