Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: 610 మంది పోలీసు అధికారులకు సేవా పతకాలు

Hyd: 610 మంది పోలీసు అధికారులకు సేవా పతకాలు

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచే పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు అవార్డులు, ప్రత్యేక సేవా పతకాలను బుధవారం ప్రదానం చేయనున్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లు ఈ పతకాలను అందచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగానే, అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు కూడా తెలంగాణా ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందచేస్తోంది.
ఈ అవార్డులలో అతి ఉత్క్రిష్ట్ సేవ పథకాలు -2022 లను 30 మంది పోలీస్ అధికారులకు, ఉత్క్రిష్ట్ సేవ పథకాలు- 2022 కుగాను 28 మందికి, అసాధారణ ఆసూచన కుశలత పధకం లను 7 గురికి, ఇన్వెస్టిగేషన్ లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కేంద్ర హోమ్ మంత్రి మెడల్స్ 11 మందికి, శౌర్య పధకం – 2022 లు 11 మందికి, మహోన్నత సేవ పథకం -2022 లు 7 గురు పోలీస్ అధికారులకు అందచేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సేవ పధకం -2019 లను 84 మంది పోలీస్ అధికారులకు, ఆంత్రిక్ సురక్ష సేవ పథకం -2019 లను 67 పోలీస్ అధికారులకు, ఆంత్రిక్ సురక్ష సేవ పధకం -2021 లను 28 మంది పోలీస్ అధికారులకు అందచేయనున్నారు.

ఈ పతకాలను అందుకోనున్న వారిలో డీ.జీ.పీ ఒకరు, అడిషనల్ డీజీలు ఇద్దరు, ఐ.జీలు ఇద్దరు, డీ.ఐ.జీలు ఒకరు, ఎస్.పీ లు ఇద్దరు, అడిషనల్ ఎస్.పీలు ఐదుగురు, డీ.ఎస్.పీలు 22 మంది ఉన్నారు. వీరితో పాటు, 39 మంది ఇన్స్పెక్టర్లు, 57 మంది ఎస్.ఐలు, 31 మంది ఏ.ఎస్.ఐ.లు, 22 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 96 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News