Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: పలు పూజా కార్యక్రమాలకు జగన్ కు ఆహ్వానం

AP: పలు పూజా కార్యక్రమాలకు జగన్ కు ఆహ్వానం

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, వేద పండితులు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 17 వరకు శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం జరుగనుంది. ఏపీ ప్రభుత్వం–దేవదాయ ధర్మదాయ శాఖ నిర్వహణలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహించనున్నారు.

- Advertisement -

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీశైలంలో జరగనున్న మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్ధానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఈవో లవన్న, వేద పండితులు. శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి 31 వరకు మహారుద్ర శతచండీ వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవం జరుగనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌కు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు వేదపండితులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News