Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: టోల్ ఫ్రీ నంబర్ 1902తో సమస్యలకు పరిష్కారం

Kurnool: టోల్ ఫ్రీ నంబర్ 1902తో సమస్యలకు పరిష్కారం

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ప్రభుత్వ పథకాలు అందని వారు టోల్ ఫ్రీ నెంబర్ 1902కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, కోడుమూరు శాసన సభ్యులు డా.జె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించడానికి జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు అందుకు సంబంధించిన వెబ్ సైటును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిశీలనలో భాగంగా ప్రతి మండల, జిల్లా, రాష్ట్ర సచివాలయాల్లో కూడా ప్రత్యేక ప్రాజెక్ట్ మానిటర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందుకుగాను ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగిందని, అందులో భాగంగా కర్నూలు జిల్లాకు రవాణా, ఆర్ అండ్ బీ సెక్రెటరీ ప్రద్యుమ్నను నియమించడం జరిగిందన్నారు. సదరు స్పెషల్ అధికారి నెలకు రెండు సార్లు పర్యటించి జగనన్నకు చెబుదాంకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడంతో పాటు పరిష్కరించిన ఫిర్యాదులను కూడా పరిశీలించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా అర్హత ఉండి సంక్షేమ పథకాలు లబ్ధి పొందని వారు మరియు ప్రభుత్వ సేవల సమస్యలకు సంబంధించిన అంశాల పై ఫిర్యాదు చేయవచ్చని ఫిర్యాదు చేసిన వాటికి వైఎస్సార్ యూనిక్ ఐడీని కేటాయించడంతో పాటు సదరు సమస్యను ఏ దశలో ఉందని ఫిర్యాదారునికి ఐవిఆర్ఎస్ ద్వారా తెలుపుతూ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. సమస్య పరిష్కారం అయిన తరువాత వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అందుకు అనుగుణంగా అధికారులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువయ్యే దిశగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. అర్హులై సంక్షేమ పథకాలు అందని వారు మరియు ఏవైనా ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమస్యలు ఎదురైతే 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి జగనన్నకి చెబుదాం లో ఫిర్యాదు చేయవచ్చని ఫిర్యాదు చేసిన తర్వాత అందుకు సంబంధించిన వైఎస్సార్ రిఫరెన్స్ ఐడి ఇస్తారని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు మరింత మెరుగ్గా పరిష్కారం చూపించేందుకు వీలుగా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించారన్నారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఇదో మంచి వేదిక అన్నారు. కోడుమూరు శాసనసభ్యులు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు తావులేని వ్యవస్థ తీసుకురావాలనే ఉద్దేశంతో విప్లవాత్మక అడుగులు వేస్తూ స్పందన కంటే మెరుగ్గా ఉండేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు. పరిష్కారం కాని సమస్యలను టోల్ ఫ్రీ నెంబర్ 1902కు కాల్ చేసి సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, అడిషనల్ ఎస్పీ డి.ప్రసాద్, జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, సిపిఓ అప్పలకొండ, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News