Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకు జగనన్న మరో ముందడుగు

Banaganapalli: సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకు జగనన్న మరో ముందడుగు

బనగానపల్లె మండల తహసిల్దార్ కార్యాలయంలో ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమంలో బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించిన జగనన్నకు చెబుదామనే కార్యక్రమం విధివిధానాలను అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటరీ వ్యవస్థ సహాయ సహకారాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల అర్హులైన పేదలకు పథకాలు అందడంలో అలసత్వం ఉండకుండా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సాహసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, అదే జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమమని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారు నేరుగా జగనన్నకు చెబుదామనే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు. వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఇంకా మెరుగైన పరిపాలన అందించాలని లక్ష్యంతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేయడం జరిగిందని దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధి పొందాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నియోజకవర్గప్రజలకుపిలుపునిచ్చారు. నిత్యం ప్రజల కోసం పరితపించే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటూనే అర్హులైన పేదలకు రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులతో అందడం జరుగుతుందని ఇలాంటి పరిపాలన మళ్లీ రావాలంటే మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన సమయం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకే కాకుండానియోజకవర్గ ప్రజలకు కూడా అవసరం ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాసులు గౌడ్, మండల అభివృద్ధి అధికారి శివరామయ్య, బనగానపల్లె ఎస్సై వీరాంజనేయులు, గ్రామ సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News