Friday, September 20, 2024
HomeతెలంగాణSingareni: ఆర్కే-7 గనిని సందర్శించిన డీసీపీ కుటుంబ సభ్యులు

Singareni: ఆర్కే-7 గనిని సందర్శించిన డీసీపీ కుటుంబ సభ్యులు

శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ఆర్కే-7 గనిని మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, వారి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అనంతరం వారు గనిలో పని స్థలాలను పరిశీలించారు. గనిలో కార్మికులు ఏ విధంగా బొగ్గును గని నుంచి బయటకు వెలికి తీస్తారో గని మేనేజర్ సాయి ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంచిర్యాల్ డిసిపి సుధీర్ రామనత్ కేకన్ మాట్లాడుతూ… ప్రకృతి విరుద్ధంగా 200 నుండి 300 లోతులోకి వెళ్లి పని చేస్తున్న కార్మికుల కష్టాన్ని తెలుసుకున్నానని వారిరికష్టాన్ని మాటల్లో చెప్పలేమని కార్మికులు వెలికి తీస్తూన్న బొగ్గు వల్లనే మన దేశంలో వెలుగులు విరజిల్లుతున్నాయని అన్నారు. మా కుటుంబ సభ్యులతో గనిని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని నా పిల్లలు కూడా గని లోపల ఇలా కార్మికులు ఏ విధంగా పనులు నిర్వహిస్తారో తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సాయిప్రసాద్, శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్సై మానస, రక్షణాధికారి రవిశంకర్, అండర్ మేనేజర్లు వెంకట రామ్, లక్ష్మణ్, శశాంక్ సాయి, ఇంజనీర్ తోట రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News