మనం చేసే మంచి పనులే మనకు జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే ఆస్థులుగా మిగిలిపోతాయని కేసీఆర్ అన్నారు. అనేక విషయాలు చాల మందికి తెలియదు, ఎవ్వలం కూడా మనం వెయ్యి సంవత్సరాలు బతకడానికి రాలేదు, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకతను అటెండర్ పని చేయవచ్చు, ఒకాయన ఎమ్మార్వో కావోచ్చు,. ఆర్డివో కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావోచ్చు ఒకాయన చీఫ్ సెక్రటరీ కావచ్చు , మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావోచ్చు ఇవి శాశ్వతం కాదు ఎవరంకూడ అధికారంలో పొద్దాక ఉండం ఒక స్టేజ్ తర్వాత 30 ఏండ్ల తర్వాత మీరు కూడ రిటైర్డ్ కావాల్సిందే కాని మనం ఉన్నప్పుడు ఏం చేసినం అన్నదే అంతిమంగా మనకు అద్భుతమైనటువంటి వేల, లక్షల కోట్ల ఆస్తికి సమానమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది . మేము ఉన్నప్పుడు ఇది చేసినం మా వల్ల ఇది కాగలిగింది అన్నదే పెద్ద పెట్టుబడి. జీవితానికి చివరికి మిగిలి ఉండేది గొప్ప సంతృప్తినిచ్చేది ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రమేనని సిఎం పాలమూరు బహిరంగ సభలో వివరించటం అందరినీ ఆకట్టుకుంది.