సరస్వతీ కటాక్షానికి ఆర్థిక అసమానతాలు అడ్డుగోడలు కావు అని నిరూపించింది.ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ యంపిసిలో 991 మార్కులు సాధించిన ఆ విద్యార్థిని కార్పొరేట్ విద్యకు సర్కార్ చదువు సవాల్ విసిరిలే చేసింది. తాజాగా విడుదలైన ఇంటర్ పరీక్షలలో 92 శాతం ఫలితాలతో తెలంగాణా ప్రభుత్వ గురుకులాలు దుమ్ము రేపే ఫలితాలు సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ రీచ్ కాగా అంతకు మించి కడు పేదరికాన్ని అధిగమించి సరస్వతీ కటాక్షానికి ఏదీ అడ్డుకాదు అని నిరూపించింది. హుజుర్నగర్ కు చెందిన కుమారి కుంజివరపు వైష్ణవి. పెయింటింగ్ రంగం చలామణిలో ఉన్నప్పుడు అద్భుతమైన ప్రతిభ కనపరచిన తండ్రి సురేందర్ ఫ్లెక్సీల యుగంలో పెయింటింగ్ రంగానికి ఆదరణ కరువై అయ్యప్ప స్వామి భక్తులకు గురుస్వామిగా ఉంటూ వారు ఇచ్చిన తృణమో ఫణమో తీసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో 991 మార్కులతో అసమాన ప్రతిభ చాటుకున్న కుమారి కుంజీవరపు వైష్ణవి కార్పొరేట్ విద్యకు సవాల్ విసిరిన కుమారి వైష్ణవి ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన విద్యా పూదోటలో ఓ మకరందమే మరి.