గుంతల మయమైన తాండూర్ రైల్వే స్టేషన్ రోడ్డు చూస్తే ఎవరైనా బెదిరిపోవాల్సిందే. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గత కొన్ని రోజుల క్రిందట మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన రోడ్డు ప్రమాదంగా మారింది. గుంతలో రోజుకి మూడు నాలుగు కార్లు పడి మెకానిక్ షెడ్ కి పరిమితం అవుతున్నాయి. పనులు ముగిశాక ఆ గుంతలను పూడ్చే విషయాన్ని మర్చిపోయారు అధికారులు. ఇలానే ఉంటే ఆక్సిడెంట్ లు జరిగి ప్రాణాలు పోయే ప్రమాదాలున్నాయని ఇటుగా తిరిగేవారంతా వాపోతున్నారు. ఇక వర్షం వచ్చిందంటే ప్రత్యక్ష నరకంగా ఉంటుంది ఈ రహదారి. కురిసిన వర్షపు నీరు గుంతలో చేరి గుంత కనిపించక మరింత ప్రమాదంగా మారిపోతోందని ఇక్కడి వారు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రహదారిపైన ఉన్న ఈ గుంతని పూడ్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.