ప్రతి రోజు 100 ఇళ్లు స్టేజ్ కన్వర్షన్ జరిగేలా చూడడంతో పాటు ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఆదోని పట్టణంలోని నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదోని శాసన సభ్యులు సాయిప్రసాద్, ఎమ్మెల్సీ డా.మధుసూధన్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లతో కలిసి పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదోని పట్టణంలోని ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ సిబ్బందిని ఆరా తీయగా లేఅవుట్ లో మొత్తం 5001 ఇళ్లు మంజూరు అందులో బేస్మెంట్ లెవెల్ లో 1248, రూఫ్ లెవెల్ – 30, ప్లింత్ భీమ్ – 3037, ప్లింత్ కాంక్రీట్ లెవెల్ – 82, లింటెల్ లెవెల్ – 2 మిగిలనవి 702 ఇంకా మొదలు కాలేదని హౌసింగ్ సిబ్బంది జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే సామాగ్రి వర్షం నీటిలో అలానే ఉండడం పట్ల సదరు సామాగ్రి పాడు అయ్యే అవకాశం ఉందని నీటిని మోటార్ ద్వారా పంప్ చేసి బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ ప్రతినిధిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలా వర్షపు నీటికి పాడవకుండా ఎత్తైన ప్రదేశంలో సామగ్రిని నిల్వ చేసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేస్తున్న కాంట్రాక్టరు భాస్కర్ రెడ్డితో ఫోన్ ద్వారా సంభాషిస్తూ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు కార్మికులకు సరైన సమయంలో కూలీ ఇచ్చేలా చూడాలన్నారు. ప్రతి రోజు స్టేజ్ కన్వర్షన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టరుకు జిల్లా కలెక్టర్ సూచించారు. అదే విధంగా ప్రతి రోజు ఇళ్ల నిర్మాణాల పనులు కూడా సమీక్షించాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన నగదు సరైన సమయంలో జమ చేయడం జరుగుతుందని అందుకు ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని హౌసింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆదోని శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి కాంట్రాక్టరుతో ఫోన్ ద్వారా సంభాషిస్తూ ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమీషనర్ రఘునాథ్ రెడ్డి, తాసిల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో గీతావాణి, హౌసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Kurnool: ప్రతి రోజు 100 ఇళ్ల స్టేజ్ కన్వర్షన్ జరిగాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES