బనగానపల్లెలోని అవుకు మండలం వేములపాడు గ్రామంలో గ్రామదేవతలైన శ్రీ దుర్గామాత, శ్రీ మారెమ్మ దేవతల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత ఈ జాతర నిర్వహించడంతో జాతర తిలకించేందుకు, మొక్కులు చెల్లించేందుకు విచ్చేసిన భక్తుల, బంధు,మిత్రుల, గ్రామ పెద్దలు ఆహ్వానం మేరకు విచ్చేసిన రాజకీయ నాయకుల ప్రముఖులతో గ్రామంలో సందడి నెలకొంది.అయితే గ్రామ దేవత జాతర అంటే ఏ గ్రామంలోనైనా జాతరకు ముందు రోజు రాత్రి ముమ్ముర్తులా అమ్మవారిని పోలిన మట్టితో చేసిన విగ్రహాన్ని తయారుచేసి గ్రామ నడిబొడ్డున ఒక వేదిక వద్ద కూర్చోబెట్టి శాంతి బలి క్రతువులను నిర్వహించి, బోనాలు సమర్పించి అమ్మవారిని పూజించటం ఆనవాయితీగా ఉంటుంది. దేవర ముగిసిన వెంటనే సాయంత్రం ఆసాదులు పెద్దమ్మ కథ చెప్తుండగా మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లి గ్రామ పొలిమేరలో నిమజ్జనం చేస్తారు. అయితే వేములపాడు గ్రామంలో పూర్వం నుంచీ వస్తున్న ఆచారం ప్రకారం గ్రామం నడిబొడ్డున ప్రత్యేక వేదిక వద్ద నిత్య పూజలు అందుకుంటున్న శ్రీదుర్గ మాత, గ్రామ శివార్లలో వెలసిన మారమ్మ దేవత విగ్రహానికి బలి క్రతువులు సమర్పించి దేవర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
గ్రామ నడిబొడ్డున ఉన్న శ్రీ దుర్గమ్మ, గ్రామ శివారులో వెలసిన మారెమ్మల జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిచ్చి తమ ఇలవేల్పులకు అమ్మవారికి బోనాలను సమర్పించి బలి క్రతువులను నిర్వహించారు.
Banaganapalli: 4 దశాబ్దాల తర్వాత జరిగిన జాతర
సంబంధిత వార్తలు | RELATED ARTICLES