Friday, November 22, 2024
HomeతెలంగాణKalvakuntla Kavitha : సీబీఐకి క‌విత మ‌రో లేఖ‌

Kalvakuntla Kavitha : సీబీఐకి క‌విత మ‌రో లేఖ‌

Kalvakuntla Kavitha : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌(సీబీఐ) కి మ‌రో లేఖ రాశారు. మంగ‌ళ‌వారం (డిసెంబ‌ర్ 6) తాను విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని తెలిపారు. ముందుగా ఖరారు అయిన కొన్ని కార్య‌క్ర‌మాల వ‌ల్ల రేప‌టి విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌ని ఆ లేఖ‌లో క‌విత పేర్కొన్నారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైన త‌న నివాసంలో విచార‌ణ జ‌ర‌ప‌వ‌చ్చున‌ని తెలిపారు.

- Advertisement -

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ క‌విత‌కు నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 6న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని తెలిపింది. దీనికి క‌విత స్పందిస్తూ ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాల‌ని కోరాగా.. వైబ్‌సైట్లో ఎఫ్ఐఆర్ కాపీ ఉంద‌ని ఈ మెయిల్ ద్వారా సీబీఐ తెలిపింది. దీనిపై స్పందించిన క‌విత మ‌ళ్లీ సీబీఐకి లేఖ రాశారు.

వెబ్‌సైట్‌లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్ణంగా ప‌రిశీలించిన‌ట్లు తెలిపారు. “నిందితుల జాబితా మొత్తం చూశాను. ఎక్క‌డా నా పేరు లేదు. అయిన‌ప్ప‌టికీ విచార‌ణ‌కు స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నా. ముందుగా ఖ‌రారు అయిన కార్య‌క్ర‌మాల వ‌ల్ల ఈ నెల 6న సీబీఐ అధికారుల‌ను క‌లుసుకోలేను. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు అనువైన ఓ రోజును చెబితే హైద‌రాబాద్‌లోని నా నివాసంలో అందుబాటులో ఉంటా. త్వ‌ర‌గా తేదీని ఖ‌రారు చేసి చెప్పండి. నేను చ‌ట్టాన్ని గౌర‌వించే వ్య‌క్తిని, ద‌ర్యాప్తున‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తా” అని క‌విత ఆ లేఖ‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News